Mahua Moitra: మోదీకే చెమటలు పట్టించిన మొయిత్రా.. ఈ డైనమిక్ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

18వ లోక్‌సభ తొలి పార్లమెంట్‌ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండో సారి పార్లమెంట్ లో అడుగు పెట్టిన ఈ డైనమిక్ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Mahua Moitra: మోదీకే చెమటలు పట్టించిన మొయిత్రా.. ఈ డైనమిక్ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Mahua Moitra: నేను నా సభ్యత్వాన్ని కోల్పోయాను, నా ఇంటిని కోల్పోయాను, ఆపరేషన్‌లో నా గర్భాశయాన్ని కూడా కోల్పోయాను. కానీ నేనేం సంపాదించానో తెలుసా? నేను భయం నుంచి విముక్తి పొందాను. నేను నీకు భయపడను. నీ అంతు చూస్తాను..! 18వ లోక్‌సభ తొలి పార్లమెంట్‌ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Trinamool Congress MP Mahua Moitra) మాట్లాడిన మాటలివి..! బీజేపీని టార్గెట్‌ చేస్తూ ఆమె సంధించిన విమర్శల బాణాలు కమలం పార్టీ నేతలకు ఎక్కడో గుచ్చుకున్నాయి. ఇది సోషల్‌మీడియాలో మొయిత్రా గురించి ఎన్డీయే వ్యతిరేక పార్టీలు చెబుతున్న మాటలు. ఇంతకీ మొయిత్రా ఎవరు? 2023లో ఆమెను లోక్‌సభ నుంచి ఎందుకు బహిష్కరించారు?

2023 డిసెంబర్‌లో టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పట్లో లోక్‌సభలో అదానీ గ్రూప్స్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందని నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా సభా ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. రూల్స్‌ను బ్రేక్‌ చేసి పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులను ఇచ్చానట్లు కమిటీ తేల్చింది. దీంతో లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌-కృష్ణానగర్‌ నుంచి 56,705 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌పై గెలిచారు మొయిత్రా. ఈ విజయంతో తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టిన మొయిత్రా నాటి విషయాన్ని ప్రస్థావిస్తూ బీజేపీపై మాటల దాడి చేశారు. తన గొంతును అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని.. తన సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరణ వేటు వేయించిందని ఆరోపించారు. అయితే ఒక ఎంపీని అణగదొక్కినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుందని ఫైర్ అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారని మండిపడ్డారు.

పార్లమెంట్‌లో పవర్‌ఫుల్‌ ప్రసంగాలతో ప్రత్యర్థులను వణికించే నేతగా గుర్తింపు తెచ్చుకున్న మొయిత్రా తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. రాజకీయాల్లోకి రాకముందు, ఆమె న్యూయార్క్, లండన్‌లలో JP మోర్గాన్ చేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఉన్నారు. 2008లో జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆమె 2010లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బహిరంగ సభల్లో ప్రసంగాలు, పోరాడే వ్యక్తిత్వం కారణంగా మొయిత్రా సీఎం మమతా బెనర్జీకి దగ్గరయ్యారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి మమతా బెనర్జీ ఆమెను పోటీకి దింపారు. బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబేపై విజయం సాధించి తొలిసారి బెంగాల్‌ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో టీఎంసీ ఆమెను కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటికి దింపింది. అప్పుడు కూడా బీజేపీ నేత కల్యాణ్ చౌబేపై 64 వేల ఓట్లతో గెలిచిన మొయిత్రా తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.

బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మొయిత్రా కోల్‌కతాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మొయిత్రా కుటుంబం అమెరికాలో స్థిరపడింది. మసాచుసెట్స్ నుంచి మ్యాథ్స్ అండ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొయిత్రా బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించి ఆ తర్వాత రాహుల్‌ గాంధీ అడుగుజాడల్లో నడిచేందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

గౌతమ్ అదానీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అనుబంధాన్ని తీవ్రంగా విమర్శించిన వారిలో మొయిత్రా ఒకరు. అయితే ఇది డబ్బులు తీసుకోని అడిగిన ప్రశ్నలగా తర్వాత ఏథిక్స్‌ కమిటీ తేల్చడం 2023 డిసెంబర్‌లో సంచలనం రేపింది. అటు 2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 23 మార్చి న కోల్‌కతాలోని మొయిత్రా నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. అటు వ్యక్తిగత జీవితానికి వస్తే మొయిత్రా డానిష్ ఫైనాన్షియర్ లార్స్‌ను గతంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి రిలేషన్‌షిప్‌ విడాకులతో ముగిసింది. ఇక లాయర్‌ జై అనంత్ దేహద్రాయ్‌తో మూడేళ్లు రిలేషన్‌ మెయింటైన్‌ చేశారని పలు వార్తా కథనాలు చెబుతున్నాయి. ఇలా మొత్తానికి పొలిటికల్‌ లైఫ్‌తో పర్శనల్‌ పరంగానూ మొయిత్రా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

Advertisment
తాజా కథనాలు