lions Akbar, Sita: పశ్చిమ బెంగాల్ జూ పార్క్‌లో సింహాల పేర్ల వివాదానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఆడ, మగ సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ఇంతటితో ముగిసినట్లు అదనపు అడ్వకేట్ జ్యోతి చౌదరి స్పష్టం చేశారు. త్రిపుర నుంచి బెంగాల్‌కు అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు అక్బర్-సీత కలిగి ఉన్నాయని తెలిపారు. అయితే సింహాల పేర్లు మారడంతో విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) హర్షం వ్యక్తం చేసింది.
ఆడ సింహం పేరు సీత కావడంపై రచ్చ..
ఈ మేరు జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా బెంగాల్ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జులాజికల్ పార్కు నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకి తీసుకొచ్చారు. అయితే అక్బర్, సీత పేర్లు కలిగిన ఆ మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో మగ సింహం పేరు అక్బర్, ఆడ సింహం పేరు సీత కావడంపై రచ్చ మొదలైంది. వేరు వేరు మతాల పేర్లు కలిగిన రెండు సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపై హిందూ సంఘాల గొడవకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టారంటూ విశ్వహిందూపరిషత్ (VHP) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీశాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Instagram: ఆ దేశంలో ఇన్‌స్టాగ్రామ్ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు!
అయితే త్రిపురలోనే అక్బర్, సీత పేర్లు పెట్టారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. అయినా వెంటనే వాటి పేర్లను మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తంచేసింది. వాటి పేర్లు మార్చాలని బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సూచించింది. ఈనేపథ్యంలో
తాజాగా సింహాల పేర్లు మారుస్తూ ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది.