West Bengal: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దులు.. బీజేపీ ఎంపీ అత్యుత్సాహం!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌ కు చెందిన బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ చేష్టలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. తనకు ఓటేయమని కోరుతూ ఓ యువతికి నడి రోడ్డుపై ముద్దు పెట్టడం రాజకీయ దుమారం రేపింది. ఆమె కూతురులాంటిదని సమర్ధించుకోగా ఫొటో వైరల్ అవుతోంది.

New Update
West Bengal: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దులు.. బీజేపీ ఎంపీ అత్యుత్సాహం!

Khagen Murmu: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న ప్రచారాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే యూపీ - అలీగఢ్ లోక్‌సభ సీటు నుంచి బరిలో దిగిన పండిట్ కేశవ్ దేవ్ చెప్పులు మెడలో వేసుకుని ప్రచారం చేసి వార్తల్లో నిలవగా.. తాజాగా పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ బీజేపీ (BJP) ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో పబ్లిక్ గా ఓ యువతికి ముద్దు పెట్టడం విమర్శలకు దారితీయగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మహిళా వ్యతిరేక నాయకులు..
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఓ యువతి చెంపపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్‌ ముర్ము ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా క్యాంప్‌లో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు ‘మోడీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.

యువతి సైతం మద్ధతు..
అయితే ఈ వివాదంపై ఖగేన్‌ స్పందిస్తూ ఆమె తన కూతురులాంటిదన్నారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తామన్నారు. యువతి సైతం.. సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే తప్పేంటని, ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారంటూ ఎంపీకి మద్దతుగా నిలవడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు