India Hockey Team: వాళ్ళకలా.. వీళ్ళకిలా.. ఒలింపిక్ పతకం గెలిచిన హాకీ జట్టుపై చిన్నచూపేల?

పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులోని కొందరు ఆటగాళ్లు భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కానీ, హాకీ ఆటగాళ్లకు సరైన స్వాగతం లభించలేదంటూ  సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

India Hockey Team: వాళ్ళకలా.. వీళ్ళకిలా.. ఒలింపిక్ పతకం గెలిచిన హాకీ జట్టుపై చిన్నచూపేల?
New Update

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోటీలో స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించిన భారత హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రికార్డు సృష్టించింది. హాకీ జట్టు సాధించిన ఈ విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ జట్టు విజయాన్ని ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇప్పుడు చారిత్రాత్మక విజయం తర్వాత, భారత హాకీ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అయితే, భారత హాకీ ఆటగాళ్లకు లభించిన  ఆదరణపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వదేశానికి వెళ్లిన భారత హాకీ జట్టు ఆటగాళ్లను అవమానించారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వాళ్ళకలా.. వీళ్ళకిలా..!
India Hockey Team: నిజానికి పారిస్‌ నుంచి భారత్‌కు బయల్దేరిన హాకీ ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే వందలాది మంది అభిమానులు ఢిల్లీ విమానాశ్రయానికి తరలివచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు బయటకు రాగానే ఘన స్వాగతం పలికారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ గెలిచి భారత్‌కు తిరిగి వచ్చిన టీమ్‌ఇండియాకు స్వాగతం పలికేందుకు విపరీతమైన జనం వచ్చారు.. టీమిండియా ఆటగాళ్లను బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. కానీ, భారత హాకీ జట్టు ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు జనం చాలా తక్కువగా ఉన్నారు. అధికారుల ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. భారత్‌లో హాకీ జట్టుకు క్రికెట్‌ కంటే ఆదరణ తక్కువే అయినా.. ఇరు జట్ల ఆటగాళ్లుకు అధికారులు ఒకేరకమైన ఏర్పాట్లు చేయాలి కదా అనే వాదన సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 

India Hockey Team: మరోవైపు, భారత హాకీ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై కూడా విమర్శలు వస్తున్నాయి. నిజానికి టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లను హోటల్‌కి తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సుకు, హాకీ ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సుకు చాలా తేడా ఉంది. హాకీ ఆటగాళ్లను తీసుకెళ్లిన బస్సు సాధారణ వోల్వో బస్సు. ఈ బస్సులో పెద్దగా సౌకర్యాలు లేవు. కానీ టీం ఇండియా ఆటగాళ్లను లగ్జరీ బస్సులో హోటల్‌కు తీసుకెళ్లారు. ఈ రెండు బస్సుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వివక్షపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత హాకీ జట్టు..
India Hockey Team: హాకీలో ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన దేశంగా నిలిచింది. ఇప్పటివరకూ  ఒలింపిక్స్‌లో హాకీ జట్టు 8 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు  సాధించింది. భారతదేశం 1928 ఒలింపిక్స్ నుండి హాకీలో పాల్గొంటోంది.  మొదటి 6 ఒలింపిక్స్‌లో వరుసగా బంగారు పతకాలు సాధించింది. హాకీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా మాత్రమే 10 పతకాలు సాధించింది. కానీ ఆస్ట్రేలియా జట్టు కేవలం 1 బంగారు పతకం మాత్రమే సాధించింది. నెదర్లాండ్స్ - గ్రేట్ బ్రిటన్ ఇప్పటివరకు 9 ఒలింపిక్ పతకాలను గెలుచుకోగా, పాకిస్తాన్ కూడా హాకీలో 8 పతకాలు సాధించింది.

#paris-olympics-2024 #india-hockey-team
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe