Weight Loss: ఈ మధ్య కాలం ఊబకాయం, అధిక బరువు చాలా మందిలో కనిపిస్తున్న సహజ సమస్యగా మారింది. రోజూ తినే ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఈ సమస్య పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది తినే ఆహరం పై అంతగా ద్రుష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణంగా ఇంట్లో చేసే చపాతీలు, ఏదైనా పిండి వంటలకు ఎక్కువగా మైదా, లేదా వీట్ ఫ్లోర్ వాడుతుంటాము. కానీ ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. వీటికి బదులు ఈ ఫ్లోర్స్ మీ డైట్ చేర్చితే అధిక బరువు పై మంచి ప్రభావం చూపుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడే హెల్తీ ఫ్లోర్స్
సజ్జ పిండి (Bajra Flour)
ప్రతీ రోజు ఇంట్లో గోధుమ పిండి ఎక్కువగా వాడే వాళ్లకు సజ్జ పిండి ఆరోగ్యకరమైన ఎంపిక. బరువు తగ్గడానికి వీటిలోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. సజ్జలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంతో పాటు శరీరంలో అధిక కొవ్వు, రక్తంలోని చక్కర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడును.
మొక్క జొన్న పిండి
మొక్క జొన్న పిండితో చేసిన ఆహార పదార్థాలు చాలా ఆరోగ్యకరమైనవి. దీనిలో ఐరన్, జింక్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జీవన శైలి సమస్యల పై ప్రభావంగా పనిచేస్తాయి. మొక్క జొన్నలోని కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావాల్సినంత ఎనర్జీని అందిస్తాయి.
సత్తు పిండి
సత్తు పిండిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. వీటిలోని పోషకాలు జీవక్రియను మెరుగుపరిచి.. శరీరంలోని వ్యర్దాలను బయటకు పంపుతాయి. అలాగే సత్తు పిండిలోని ఫైబర్, ప్రోటీన్ గుణాలు ఎక్కువ సమస్యం కడుపు నిండుగా ఉండనే భావనను కలిగించి.. అధిక కేలరీల వినియోగాన్ని తగ్గించును. ఇది బరువు తగ్గడానికి సహాయపడును.
రాగి పిండి
సహజంగానే రాగి పిండిలో ఐరన్, కాల్షియం ఎముకలను దృడంగా ఉంచుతాయి. అంతే కాదు రాగిలోని పోషకాలు శరీరంలో ఐరన్ శోషణకు ఉపయోగపడతాయి. మధుమేహ సమస్య ఉన్నవారికి కూడా రాగులు సరైన ఎంపిక. ఇవి శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించును.
అమరాన్త్ ఫ్లోర్ (రాజగిరి పిండి)
ఇది ఒక రకమైన ధాన్యం. ఈ పిండిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు వీటిలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే త్వరగా కూడా జీర్ణమవుతాయి.
Also Read: Health Tips : ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందా.. అయితే మీకు సమస్యలు ఉన్నట్లే..?