Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే..

గురుకుల టీజీటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. గురుకుల పరీక్షలు రాసిన అభ్యర్థులు నేటి నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గురుకుల బోర్డు. అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్ స్వీకరించనుంది బోర్డు.

New Update
Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే..

Gurukul Teacher Aspirants: గురుకుల టీజీటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. గురుకుల(Gurukul) పరీక్షలు రాసిన అభ్యర్థులు నేటి నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ (Web Options) పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గురుకుల బోర్డు. అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్ స్వీకరించనుంది బోర్డు. అభ్యర్థులు తాము పని చేయదలుచుకున్న, తమకు అనువైన సొసైటీల వివరాలను ప్రాధాన్యత క్రమంలో వరుసగా ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల ట్రస్ట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు గురుకుల అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటన ప్రకారం.. గురుకుల పరీక్ష రాసిన టీజీటీ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి గడువునిచ్చారు. ఇక లైబ్రేరియన్‌, పీడీ, డ్రాయింగ్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టుల అభ్యర్థులు అక్టోబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆప్షన్లను ఇవ్వాలని సూచించారు. అయితే, ఆప్షన్స్ ఎంచుకునే ముందు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. ఒకసారి సొసైటీ ప్రిఫరెన్స్‌ ఆప్షన్లు ఇచ్చాక తదుపరి ఎడిట్‌ ఆప్షన్‌ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Also Read:

Congress: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్న స్క్రీనింగ్‌ కమిటీ..ఛాన్స్ ఎవరికో..?

BIG BREAKING: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు