/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Hyderabad_-Rains-for-five-more-days-in-Telangana-jpg.webp)
Telangana Weather: తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ(IMD Hyderabad). తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం(Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను విడుదల చేసిన వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. సోమవారం నాడు రాష్ట్రంలోని మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇక ఈ నెల 12, 13 తేదీల్లో తేలికపాటు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాత్రి మొదలు మరుసటి రోజు అంటే 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కోమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఈ రోజున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పారు. అలాగే, 16, 17 తేదీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి వర్షం కురుస్తుందని చెప్పారు అధికారులు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కూలీ పనికి వెళ్లిన వారు, పశువుల కాపరులు, రైతులు, ఇతర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిల్చోవద్దని సూచించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2023
కాగా, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో దంచి కొట్టింది వర్షం. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, కొత్తపేట్, చైతన్యపురి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2023
Also Read:
Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే..