Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.

Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!
New Update

Low Temperature in Telangana: తెలంగాణ చలి తీవ్రంగా గణనీయంగా పెరుగుతోంది. సూర్యుడు కనిపిస్తే ఒట్టు అన్నట్లుగా పరిస్థితి మారింది. డిసెంబర్‌ మొదటి వారం నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంలో చలికి జనం వణికిపోయారు. అందరూ తమ స్వెట్టర్లు తీస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేడి కోసం చలి మంటలు కాచుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా చలి రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.

డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతోంది. హైదరాబాద్ శివారులో అత్యల్పంగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31 డిగ్రీలుగా నమోదైంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్‌, మెదక్‌లో 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్‌లో 15.7, రామగుండంలో 14.6, హైదరాబాద్‌లో 16.56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం 17, మహబూబ్ నగర్ 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also Read:

‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..

ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

#telangana-weather #low-temperature-in-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe