తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్..!!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ..తెలంగాణలో నాలుగు రోజులు, ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

New Update
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్..!!

తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణశాఖ. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణశాఖ అధికారులు...మంగళవారం నుంచి వర్షాలు పడతాయని తెలిపారు. తెలంగాణలో నాలుగు రోజులపాటు, ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు.

heavy rains

కాగా ఆదివారం హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు, గొర్రెల కాపరులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని..చెట్ల కింద ఉండకూదని సూచించారు అధికారులు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమవ్వడంతో తెలంగాణతోపాటు ఏపీలో ఆశించిన స్ధాయిలో వర్షాలు పడలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వానలు జోరందుకునే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 22న రాష్ట్రంలోకి వచ్చిన నైరుతి రుతుపవనాలతో చాలా చోట్ల మోస్తరు వానలు కురిసాయి. జూన్ లో సాధారణం కంటే 46శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.

Advertisment
తాజా కథనాలు