ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం(Hair Fall) సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతలతో బాధపడుతూ ఉంటారు. ఆడవారిలో కూడా ఈ సమస్య రోజు రోజుకు అధికమవుతోంది. మరికొందరు జుట్టు రాలిపోతుందంటే చాలు ఎంతో డిప్రెషన్‌కు వెళ్లిపోతారు. జుట్టు లేకపోతే అందవిహీనంగా కనిపిస్తారని, జుట్టు ఎక్కువగా ఉంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోందని అంటుంటారు. మగవారు అయితే బట్టతలపై జుట్టు రావడం కోసం చేయని ప్రయత్నం ఉండదు. ఇక పెళ్లి కాని ప్రసాదుల సంగతి అయితే వర్ణణాతీతం. ఆన్‌లైన్‌లో చూపించే ప్రతి ఆయిల్‌ను ట్రై చేస్తుంటారు, వైద్యులను సంప్రదించి రకరకాల చికిత్సలు కూడా చేయించుకుంటారు. మరికొందరు అయితే చేసేదేమీ లేక బట్టతలను కవర్ చేసుకోవడానికి టోపీలు ధరిస్తూ ఉంటారు. టోపీ పెట్టుకున్నా, అలాగే బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ వినియోగించినా జుట్టు రాలిపోయి బట్టతల మరింత ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే దీనిపై నిపుణులు కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-->జుట్టు రాలిపోవడానికి కారణాలు
జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుఉన్నాయి. కేవలం టోపీ పెట్టుకుంటేనే జుట్టు ఊడిపోతుందని అనుకోవడం అపోహనే అని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల మార్పులు, జన్యు పరమైన కారణాలు, తినే ఆహారంతోనూ జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. అయితే టోపీ ధరిస్తే తల వేడి ఉంటుందని, కానీ బిగుసుకుని ఉండే టోపీలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టైట్‌గా ఉండే టోపీలు పెట్టుకుంటే చెమట అధికమై బ్యాక్టీరియా పెరుగుతుందని అంటున్నారు.
--> నిద్రలేకపోయినా జుట్టు ఊడుతుందా?
సరిగా నిద్రపోకపోయినా, మానసిక కుంగుబాటు కారణంగా జుట్టుపై ఎక్కువ ప్రభావం పడుతుందని, దీని వల్ల జుట్టు ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి కారణంగా మన హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతాయని వెల్లడిస్తున్నారు. అందుకే రోజూ 8 గంటల నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
--> జంక్ ఫుడ్ కూడా కారణమా?
ప్రస్తుత కాలంలో జంక్, ప్రాసెస్ ఆహారం తినేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జంక్ ఫుడ్ తినడం వల్ల జుట్టుకు రక్తప్రసరణ సరిగా జరగదు. అంతేకాకుండా మన జుట్టు కుదుళ్లు కూడా బలహీనంగా మారుతాయి. దీంతో జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది.
--> వ్యాయామం చేయకపోయినా
సరిగా వ్యాయామం చేయకపోతే తలలో రక్త ప్రసరణ బాగా అవదు. దీంతో కూడా జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు.
గర్భ నిరోధక మాత్రలతో జుట్టు రాలుతుందా?
మహిళలు గర్భ నిరోధక టాబ్లెట్స్ వాడితే కూడా జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు.
Also Read: టీమిండియాకు గట్టి షాక్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో వరల్డ్‌కప్ హీరో ఔట్!
WATCH: