/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ganta-Srinivasa-Rao-jpg.webp)
Ganta Srinivasa Rao: విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.