RTV Exclusive Video: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ వయనాడ్ లో ఘోర విపత్తు బాధితులకు సాయం చేయడానికి ఆర్మీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందక్కై-చురాల్‌మల మధ్య 24 గంటల్లోపే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ఆర్టీవీ ప్రతినిధి అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Aug 2024 in నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 290కి పైగా ప్రజలు చనిపోయారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంట్లలోనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాధితులను కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఓ వైపు మృతదేహాలను వెలికితీయడంతో పాటు మరో వైపు సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముందక్కై-చురాల్‌మల మధ్య 24 గంటల్లోనే బ్రిడ్జి నిర్మించి సంచలనం సృష్టించింది. ఈ బ్రిడ్జిపై ఆర్మీ వెహికిల్ తో ట్రయల్ రన్ ను సైతం నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో భావోద్వేగానికి గురైన ఆర్మీ సిబ్బంది, స్థానికులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: Wayanad: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..! ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే RTV సైతం వయనాడ్ కు వెళ్లింది. అక్కడ బాధితుల పరిస్థితిని, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏ తెలుగు ఛానల్ చేయని సాహసాన్ని ఆర్టీవీ చేస్తోంది. ఓ పక్క వయనాడ్ లో ఆగకుండా వర్షం కురుస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతవారణం నెలకొంది. అయినా.. ఆర్టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి అక్కడి హృదయవిదారక దృశ్యాలను దేశానికి తెలియజేస్తున్నారు. కేవలం న్యూస్ కవర్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్మీ అధికారులతో కలిసి సహాయక చర్యల్లో కూడా పాలుపంచుకుంటున్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారో.. అక్కడ RTV ఉంటుందని మరోసారి నిరూపిస్తున్నారు. వయనాడ్ నుంచి ఆర్టీవీ మాత్రమే అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ కింది వీడియోల్లో చూడండి. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-01-at-8.08.52-PM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/Indian-Army.jpg"> https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-01-at-8.08.53-PM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/245.jpg"> https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-01-at-8.08.53-PM-3.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/3.jpg"> #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి