Nagarjuna sagar: రేపటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం! తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉండడంతో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక ఈ నెల(అక్టోబర్)లో తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. By Trinath 05 Oct 2023 in Latest News In Telugu నిజామాబాద్ New Update షేర్ చేయండి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవడంలేదు. దీని వల్ల వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారికి పలు విజ్ఞప్తులు చేస్తుండడంతో ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు. తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉండడంతో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. వానలు లేక, సాగర్ రిజర్వాయర్‌లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ రైతాంగానికి పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తుండడంతో ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వర్షాలు కురుస్తాయా? ఈ నెల(అక్టోబర్)లో తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబరులో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవగా.. ఒక్కరోజులో అత్యధికంగా కరీంనగర్ లో 440.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ALSO READ: ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే! #nagarjuna-sagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి