ప్రస్తుతం బెంగళూరులో నీటికొరత దారుణంగా ఉంది. నీరు దొరకక ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడుతున్న వార్తలు రోజూ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అలాఅని ఇది బెంగళూరుకు మాత్రమే పరిమితమైన సమస్య అనుకోవడానికి లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్లా నీటి ఎద్దడి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. గాలి నుండి నీటిని(Water from Air) తయారు చేసే సాంకేతికత (ఫ్రమ్ ఎయిర్ టు వాటర్) నిశ్శబ్దంగా పెరుగుతోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఉరవూ ల్యాబ్స్ గాలి నుంచి నీటిని తయారు చేస్తోంది. ఇప్పటికే కొన్ని హోటళ్లలో ఇలా తయారు చేసిన వాటర్ బాటిళ్ల(Water from Air)ను వాడుతున్నారు. ఉరవు ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు స్వప్నిల్ శ్రీవాస్తవ్, ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి సమాచారం ఇచ్చారు.
కాల్షియం ఆక్సైడ్, కాల్షియం క్లోరైడ్ మొదలైన తేమను గ్రహించే పదార్థాల లక్షణాల ఆధారంగా గాలి నుండి నీటిని(Water from Air) తొలగించే సాంకేతికతను ఉరవు అభివృద్ధి చేసింది. గాలిలోని తేమను ఈ పదార్థాల ద్వారా గ్రహిస్తారు. తరువాత ఆ పదార్ధాలను వేడి చేస్తారు. ఈ విధానం ద్వారా ఆ పదార్ధాలలో ఆవిరి తీసుకుంటారు. నియంత్రిత వేడి - శీతలీకరణ ప్రక్రియల ద్వారా ఈ ఆవిరిని తాగడానికి ఉపయోగపడే నీరుగా మార్చుతారని ఉరవూ ల్యాబ్స్ సీఈవో తెలిపారు.
బెంగళూరులో యూనిట్..
ఉరవు ల్యాబ్స్‌కు(Water from Air) బెంగళూరులో తయారీ యూనిట్ ఉంది. గత ఏడాది కాలంగా నీటిని తయారు చేస్తున్నారు. విశేషమేమిటంటే ఉరవూ ల్యాబ్స్‌లోని వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్‌తో తయారు చేయడం లేదు. వీరు వాటర్ కోసం గాజు సీసాలు(Water from Air) వాడతారు. ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం కోసమే ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇంతకు ముందు పెప్సీ, కోకాకోలా తదితర కూల్ డ్రింకులు గాజు సీసాలలో వచ్చేవి. తాగిన తర్వాత బాటిల్ తిరిగి ఇచ్చేసి అవకాశం వీటితో ఉంటుంది. అదేవిధంగా ఉరవూ ల్యాబ్స్ తన 'ఫ్రమ్ ఎయిర్' వాటర్ బాటిల్స్‌తో ప్రయోగాలు చేస్తోంది.
Also Read: అంతరిక్షంలో టాటా సైనిక ఉపగ్రహం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
బెంగళూరులో గత 8 నెలల్లో కంపెనీ 3.5 లక్షల వాటర్ బాటిళ్లను విక్రయించింది. తమ ప్రోడక్ట్ పై విశ్వాసం ఉన్న కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని సీఈవో స్వప్నిల్ శ్రీవాస్తవ అంటున్నారు. ఉరవూ ల్యాబ్స్ వాటర్ బాటిల్‌పై 'ఫ్రమ్ ఎయిర్'(Water from Air) ట్రేడ్‌మార్క్ కనిపిస్తుంది. దీనితో పాటు 'క్రాఫ్టెడ్ బై ఉరవు' అనే పదాలు బాటిల్‌పై ఉంటాయి.
70 మంది ఉద్యోగులు..
ఉరవు ల్యాబ్స్‌కు బెంగళూరులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో 70 మంది ఉద్యోగులు ఉన్నారు. దాని సాంకేతికత ఆధారంగా అనేక అప్లికేషన్లు ఉన్నాయి. ఉరవు ల్యాబ్స్ అబుదాబిలో చెట్లకు గాలి నుంచి నీటిని సరఫరా చేసే హైడ్రోపోనిక్స్ ప్రాజెక్ట్‌ను నడుపుతోంది.
ఉరవు ల్యాబ్స్ తీసుకువచ్చిన ఈ విధానంలో(Water from Air) ప్రధాన లోపం దాని నీటి తయారీ ఖర్చు. లీటరు నీటిని ఈ విధానంలో తయారు చేయడానికి 4 నుంచి 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే, నీటి కొరత మరింత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. 2030 నాటికి నీటి ఉత్పత్తి వ్యయాన్ని లీటరుకు 50 పైసలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉరవూ ల్యాబ్స్ సీఈవో చెబుతున్నారు.