Viral Video: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!

బీహార్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలు రైల్వే స్టేషన్‌లో పట్టాలపై పడిపోవడంతో వారి మీదుగా రైలు వెళ్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడుకున్న తల్లికి అంతా సెల్యూట్ చేస్తున్నారు.

New Update
Viral Video: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!

తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. ప్రపంచంలోని తల్లిని మించి ప్రేమించేవారు మరేవరూ ఉండరంటారు. భూమిపై బిడ్డ తొలి అడుగు పెట్టకముందు నుంచే తల్లి ప్రేమ మొదలవుతుంది. కడుపులో ఉండగానే తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. చివరి శ్వాస వరకు బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి తన ప్రాణాలను ఏ మాత్రం లెక్కచేసుకోదు. బిడ్డలు ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లి చివరకు వారి కోసం ప్రాణాలను వదులుకునేందుకు కూడా వెనకాడదు. ఎన్నో సందర్భాలు ఈ మాటలన్ని నిరూపితమయ్యాయి. మరోసారి కూడా అదే ప్రూవ్‌ అయ్యింది. బీహార్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఆ తల్లికి సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఇంతకీ ఏం జరిగింది?


ఏం జరిగిందంటే?
ఢిల్లీ వెళ్లేందుకు బార్హ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు తల్లి, ఇద్దరు బిడ్డలు. ట్రైన్‌ ఎక్కేందుకు ఫ్లాట్‌ఫారమ్‌పై నిలబడ్డారు. ఇంతలోనే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒకరిపై ఒకరు పడ్డారు. కొంతమంది తెలియకుండానే తోసేసుకున్నారు. ఈ క్రమంలోనే తల్లి, ఇద్దరు బిడ్డలు ట్రైన్‌ పట్టాలపై పడిపోయారు. వెంటనే ట్రైన్ వచ్చేసింది. ఇక తల్లీబిడ్డలు బతకడం అసాధ్యమే అనుకున్నారు. ఆ ముగ్గురికి అక్కడ నుంచి తప్పించుకోనే ఛాన్స్ లేకుండా పోయింది. అయితే పట్టల మధ్యలో లేకుండా వెంటనే పక్కకు జరిగారు. రెప్పపాటు వ్యవధిలో తల్లి తన ఇద్దరి బిడ్డలను ముడుచుకోని కిందకు కూర్చుండిపోయింది. తనకు ఏమైనా పర్లేదు కానీ తన బిడ్డలు మాత్రం బతకాలని అలా చేసింది. అయితే అదృష్టవశాత్తూ ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

మహిళ, ఆమె పిల్లలు తమ కుటుంబంతో సహా ఢిల్లీకి విక్రమశిలా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి బీహార్‌లోని బార్హ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఒక పెద్ద గుంపు రైలు ఎక్కడం ప్రారంభించింది. ఎక్కే హడావిడిలో, ముగ్గురూ ప్లాట్‌ఫారమ్ నుంచి నెట్టివేయబడ్డారు... వెంటనే పట్టాలపై పడిపోయారు.కుటుంబాన్ని రక్షించాలంటూ కంగారుపడిన ప్రయాణికులు కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. భయాందోళనలో, తల్లి తన పిల్లలపైకి వంగి, ట్రైన్‌ యాక్సిడెంట్‌ నుంచి పిల్లలను రక్షించింది. కుటుంబం మీదుగా వేగంగా వెళుతున్న రైలు వారిని తాకలేదు. ఈ ఘటనతో అక్కడివారు విస్మయానికి గురయ్యారు. ఇది అక్కడి ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Also Read: ‘తాత్కాలిక కమిటీ ఏర్పాటు..’ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు