Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ... టెస్లా కార్లతో రామ నామం!

అమెరికాలోని 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఏర్పాటు అయ్యాయి. ఈ ఈవెంట్‌ మొత్తాన్ని నిర్వాహకులు డ్రోన్‌ ల ద్వారా ఫోటోలు తీసారు

Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ... టెస్లా కార్లతో రామ నామం!
New Update

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు దగ్గర పడుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా రామ నామ జపంతో భక్తి పరవశ్యంలో మునిగి తేలుతున్నారు. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ముందు అమెరికాలోని (America) 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో (Tesla Cars) వాషింగ్టన్‌ డీసీలోని మేరీల్యాండ్‌ శివారులోని ఫ్రెడరిక్‌ నగర్‌ లో శ్రీ భక్తాంజనేయ ఆలయానికి భక్తులు శనివారం రాత్రి అధిక సంఖ్యలో చేరుకున్నారు.

టెస్లా కార్లలోని ముఖ్య ఫీచర్లలో ఒకదానిని వారు ఉపయోగించుకుని టెస్లా కార్ల స్పీకర్లు రాముడికి అంకితం చేసిన పాటను ప్లే చేస్తూ ఉండగా కార్ల హెడ్‌ లైట్లు లైట్‌ గేమ్‌ ప్లే చేశాయి. కార్లన్నిటిని కూడా రామ్‌ అనే పేరు వచ్చే ప్యాట్రన్లో పార్క్‌ చేసి ఈ అద్భుతమైన థీమ్‌ ని ఆవిష్కరించారు.

ఈ ఈవెంట్‌ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆఫ్‌ అమెరికా తెలిపిన వివరాల ప్రకారం 200 మందికి పైగా టెస్లా కార్ల యజమానులు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకున్ఆరు. ఈ ఈవెంట్‌ మొత్తాన్ని నిర్వాహకులు డ్రోన్‌ ల ద్వారా ఫోటోలు తీసారు. టెస్లా కార్లన్ని కూడా 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఉన్నాయని చూపుతున్నాయి.

'' అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంలో మేము టెస్లా రామ్‌ భగవాన్‌ సంగీత కచేరీ నిర్వహించాము. గత 500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం కోసం పోరాడుతున్న హిందువులందరికీ మేము ఎన్నో కృతజ్ఙతలు తెలుపుతున్నామని అమెరికా వరల్డ్ హిందూ కౌన్సిల్‌ ప్రెసిడెంట్ మహేంద్ర సాపా తెలిపారు.

అమెరికాలో రామ మందిర వేడుకలకు సారథ్యం వహిస్తున్న వీహెచ్‌పీ అమెరికా శనివారం 21 నగరాల్లో కార్‌ ర్యాలీలు నిర్వహించగా మరో పక్క విశ్వహిందూ పరిషత్ 10కి పైగా రాష్ట్రాల్లో 40కి పైగా పెద్ద బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Also read: ఎవరీ మోహిత్‌ పాండే..అతనినే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా ఎందుకు నియమించారు!

#tesla-cars #america #ayodhaya-ram-amndir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe