Viral Video: రిపోర్టింగ్‌ చేస్తుండగా పేలిన బాంబు.. ఆ మహిళా జర్నలిస్ట్‌ ధైర్యానికి సెల్యూట్‌..!

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా జర్నలిస్ట్ యూమ్నా ఎల్ సయ్యిద్‌ ఓ భననంపై నిలబడి రిపోర్ట్ చేస్తుండగా.. వెనుక ఉన్న పాలస్తీనా టవర్‌పై క్షిపణి దాడి జరిగింది. భయంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ యూమ్నా రిపోర్టింగ్‌ని కంటిన్యూ చేసింది.

Viral Video: రిపోర్టింగ్‌ చేస్తుండగా పేలిన బాంబు.. ఆ మహిళా జర్నలిస్ట్‌ ధైర్యానికి సెల్యూట్‌..!
New Update

Video Captures Moment Missile Striking Palestinian Tower is Captured on Live TV Leaving Reporter Screaming: ఓవైపు బాంబుల మోత.. మరోవైపు పేలుతున్న తుపాకీ తూటాలు.. మధ్యలో రిపోర్టింగ్‌ చేయాల్సిన పరిస్థితి. భీకర యుద్ధంలో.. మారణహోమంలో.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయే జర్నలిస్టులు ఎందరో..! ఇజ్రాయెల్‌-పాలస్తీనా(Israel vs palestina) మధ్య నలిగిపోతున్న బతుకులెన్నో.. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని బిక్కుబిక్కుమంటూ రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటుండగా.. మరికొందరు హమాస్‌ తీవ్రవాదుల చేతికి చిక్కి బలైపోతున్నారు. ఇంకొందరు కిడ్నాప్‌ అవుతున్నారు. వీటన్నిటిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత రిపోర్టర్లది. ఆ మహిళా రిపోర్టర్‌(Reporter) కూడా అదే చేసింది. ఓవైపు బాంబుల వర్షం కురుస్తున్నా జరుగుతున్న పరిణామాలను వివరించింది. వర్క్‌ విషయంలో ఆమెకు ఉన్న డెడికేషన్‌కి ప్రపంచం ఫిదా అవుతోంది.



అసలేం జరిగింది?

పాలస్తీనా ఇస్లామిస్ట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్(Israel) పై భారీ దాడి చేసింది. ఇది దశాబ్దాలలో అతి పెద్ద దాడి. 20నిమిషాల్లో 5వేలకు పైగా రాకెట్లతో విరుచుకుపడిన హమాస్‌ తీవ్రవాదులు వందల మందిని పొట్టనపెట్టుకున్నారు. ఇటు ప్రతీకార చర్యలకు దిగిన ఇజ్రాయెల్‌ హమాస్‌ సంస్థ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి దొరికిన వారిని చంపుతోంది. ఈ ఘటనలను ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా(al Jazeera) జర్నలిస్ట్ యూమ్నా ఎల్ సయ్యిద్‌(Youmna El Sayed) కవర్‌ చేస్తున్నారు. ఓ బిల్డింగ్‌ ఎక్కి అక్కడ జరుగుతున్న సీన్స్‌ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. న్యూస్‌ ప్రజెంటర్‌ అడుగుతున్న వాటికి సమాధానం ఇస్తున్నారు.

తర్వాత ఏం జరిగింది?

యూమ్నా సయ్యిద్‌ రిపోర్ట్ చేస్తుండగా ఇంతలోనే వెనక పెద్ద బాంబు పేలింది. ఇది వీడియోలో కూడా రికార్డ్ అయ్యింది. వెంటనే ఉలిక్కిపడ్డ యూమ్నా చెవులు మూసుకుంటూ పక్కకు జరిగింది. చాలా టెన్స్‌ ఫీల్ అయ్యింది. జరిగిన పరిణామాన్ని ఊహించని న్యూస్‌ ప్రజెంటర్‌ యూమ్నాని సేఫ్‌ ప్లేస్‌కి వెళ్లమని సూచించారు. టీమ్‌ మొత్తాన్ని ముందు సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా చెప్పారు. ఇంతలోనే తేరుకున్న యూమ్నా తనకు ఏం కాలేదని రిపోర్టింగ్‌ కంటిన్యూ చేసింది. కన్నీళ్లను ఆపుకుంటూ 'గాజా సిటీ మధ్యలో ఉన్న పాలస్తీనా టవర్‌పై జరిగిన క్షిపణి దాడి ఇది.' అని రిపోర్ట్ చేసింది. నిజానికి గాజా(Gaza) స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి. ఇది కేవలం 140 చదరపు మైళ్ల పరిధిలో సుమారు 20 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తుంది.

ALSO READ: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!

#israel-vs-palestina
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe