వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతికి పుతిన్ కారణమా?

ప్రిగోజిన్ మృతి తరువాత.. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యం భాద్యతలు ఆండ్రీ ట్రోవేష్ చేతికి వెళ్ళవచ్చని భావిస్తున్నారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు తరువాత సైన్యం భాద్యతను ఆండ్రీ ట్రోవేష్ చూసుకుంటాడని పుతిన్ ప్రకటించిన విషయం మనకి తెల్సిందే. మొత్తానికి ప్రిగోజిన్ మృతి రష్యాతో పాటు అన్ని దేశాల నిఘా వర్గాల్లో చర్చకు దారి తీసింది.

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతికి పుతిన్ కారణమా?
New Update

ప్రిగోజిన్ మృతిపై అనుమానాలు..

పుతిన్ హస్తం లేకుండా రష్యాలో ఏదీ జరగదు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిఘా వర్గాలు కూడా ప్రిగోజిన్ మృతికి పుతిన్ కారణమని నమ్ముతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధం టైంలో కీలకపాత్ర పోషించిన వాగ్నర్ గ్రూప్.. రెండునెలల క్రితం పుతిన్ అధికారాన్ని సవాలు చేస్తూ తిరుగుబాటు చేసింది. అయితే సైన్యంలోని అసమర్థ అధికారులపై మాత్రమే ఈ తిరుగుబాటని.. పుతిన్‌పై పూర్తి నమ్మకముందని ప్రిగోజిన్ చెప్పాడు. కానీ 23 ఏళ్లుగా తిరుగులేని అధికారం చేస్తున్న పుతిన్ ఈ తిరుగుబాటును భరించలేకపోయాడని.. అందుకే ప్రిగోజిన్‌ని హత్య చేయించాడని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

హత్యగానే భావిస్తున్న మీడియా..

బుధవారం జరిగిన ప్లేన్ క్రాస్‌కి ముందే ప్లేన్‌లో బాంబు బ్లాస్ట్ జరిగి ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు వాగ్నర్‌కు చెందిన గ్రేజోన్ టెలిగ్రాం ఛానల్ కూడా దీన్ని హత్యగానే చెబుతోంది. ఈ ప్లేన్ క్రాస్‌లో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో సీనియర్ అధికారి దిమిత్రి ఉత్కిన్ సహా మరికొంతమంది చనిపోయారు. సాధారణంగా సైన్యంలోని కమాండర్లు అందరూ ఇలా ఒకే విమానంలో ఎప్పుడు ట్రావెల్ చేయరు. దీంతో అసలు వీరందరూ కలిసి సెయింట్ పీటర్స్ బర్గ్‌కి ఎందుకు వెళ్లారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు ఒకేసారి రెండు పేలుళ్లను విన్నట్లు గార్డియన్ పత్రిక తన ఆర్టికల్‌లో పేర్కొంది.

రష్యా ప్రభుత్వంపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు..

జూన్ 23న రష్యా ప్రభుత్వంపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేయగా.. సరిగ్గా రెండు నెలల తరువాత వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ప్లేన్ క్రాస్‌లో చనిపోవడం అనుమానం రేకెత్తిస్తోంది. అంతేగాక ఈ ప్లేన్‌తో పాటు మరో ప్లేన్ కూడా సెయింట్ పీటర్స్ బర్గ్‌కి అదే టైంలో ప్రయాణించింది. మరోవైపు ఈ ప్రమాదానికి ముందు సిగ్నల్ లాస్ అవ్వడంతో.. అక్కడ జామర్లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రిగోజిన్ మృతి తరువాత.. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యం భాద్యతలు ఆండ్రీ ట్రోవేష్ చేతికి వెళ్లవొచ్చని భావిస్తున్నారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు తరువాత సైన్యం భాద్యతను ఆండ్రీ ట్రోవేష్ చూసుకుంటాడని పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి ప్రిగోజిన్ మృతి రష్యాతో పాటు అన్ని దేశాల నిఘా వర్గాల్లో చర్చకు దారి తీసింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe