Eye Health: కాలక్రమేణా కంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇటీవలే చేసిన సర్వేలో ఇలా పేర్కొనబడింది. గత 10 సంవత్సరాలలో 10 మంది పెద్దలలో ఆరుగురు కంటి చూపు సమస్యలను ఎదుర్కుంటున్నారు. వారిలో 40 శాతం మంది కనీసం చూడడానికే ఇబ్బంది పడుతున్నారు. 74 శాతం మంది తమ కంటి చూపు బలహీనంగా ఉందని, దాని లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
మీ కళ్ళు పాడవుతున్నాయని గుర్తించే సంకేతాలు ఇవే..
- ఎప్పుడైనా హోటల్‌లో తినడానికి వెళ్లినట్లయితే, ఫుడ్ మెనూ లేదా చిన్న పదాలను స్పష్టంగా చదవలేకపోవడం, దూరం నుంచి అక్షరాలను గుర్తుపట్టలేకపోవడం జరుగుతుంది.
- కంటి చూపు సమస్య ఉన్నవారికి మొబైల్‌లో పదాలు కనిపించకపోవడం, వాటిని జూమ్ చేయడం చేస్తుంటారు.
- కంటి చూపు క్షీణించిన వారికి చదవడానికి లేదా పని చేయడానికి సాధారణం కంటే ఎక్కువ లేదా ప్రకాశవంతమైన కాంతి అవసరం కావచ్చు.
- కంటి చూపు సమస్య ఉన్న వారికి సాధారణ దూరంలో ఉన్న వస్తువులు కూడా అస్పష్టంగా కనిపించడం జరుగుతుంది. చూపు తగ్గిపోతుందని తెలిపే ముఖ్యమైన లక్షణాల్లో ఇది ఒకటి.
- ఏదైనా చదివిన తర్వాత కంటి పై ఒత్తిడి, తల నొప్పిగా ఉన్నట్లు అనిపించడం కళ్ళు పాడవుతున్నాయని తెలిపే సంకేతం.
కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా..?
పుష్కలమైన ఆహరం
ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్లు , మినరల్స్ చేర్చాలి. ఇవి ఆరోగ్యానికి అలాగే కళ్ళకు కూడా ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. విటమిన్ సి, ఆకు కూరలు, చేపలు, పాలకూర, నారింజ వంటి వాటిని తీసుకోవాలి.
హైడ్రేషన్
శరీరానికి తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. నీరు త్రాగడం వల్ల కళ్లలో పొడిబారిన సమస్య తొలగిపోయి.. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది.
ధూమపానం మానేయండి
ధూమపానం అనేక వ్యాధులకు ప్రధాన కారణం. ముఖ్యంగా కళ్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల కంటిశుక్లం, కంటి నరాల దెబ్బతినడం, దృష్టి లోపం, అంధత్వం వంటి సమస్యలు పెరుగుతాయి.
స్క్రీన్ సమయాన్ని నిర్వహించండి
ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం కళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తున్నప్పుడు, ప్రతి గంట తర్వాత 20 నిమిషాల విరామం తీసుకోవాలి.
Also Read: Food Habits: పొరపాటున పాలతో వీటిని కలిపి తిన్నారో.. మీ పని అంతే..!