/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Warangal_-Suspension-of-Medico-Saif-lifted-jpg.webp)
Medico Preethi Case: కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ (KMC PG medical student Saif) వేధింపులతో ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ చేస్తున్న జూనియర్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌పై కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ (Anti Ragging Committee) విధించిన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా వెత్తివేశారు. అయితే హైకోర్టు (High Court orders) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొని, తరగతులకు హాజరు అయ్యేందుకు అనుమతిచ్చినట్లు ప్రిన్సిపల్ డా. మోహన్‌దాస్ (Principal Dr. Mohandas) మంగళవారం చెప్పారు.
ఈ కేసుకు సంబంధించిన గత వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ తనను మానసికంగా వేదిస్తున్నాడంటూ ఆనస్టేషియా హెచ్‌వోడీ, కేఎంసీ ( HVD, KMC) ఉన్నతాధికారులకు డాక్టర్ ప్రీతి ఫిర్యాదు చేసింది. తర్వాత రెండ్రోజుల్లోనే ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎంజీఎం అత్యవసర శస్త్ర చికిత్స గదిలో ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ప్రీతి.. నిమ్స్ ఆస్పత్రి(Nims Hospital)లో చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు డాక్టర్ సైఫ్‌పై పోలీసులు కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత మార్చి 4న సమావేశమైన కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్‌ను అకాడమిక్ తరగతులకు హాజరుకాకుండా సంవత్సర కాలం పాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణ తీసుకోకుండానే తనను సస్పెండ్ చేశారని కోర్టుకు విన్నవించుకున్నాడు. సైఫ్ వివరణ తీసుకోవాలని కేఎంసీ ప్రిన్సిపల్, యాంటి ర్యాగింగ్ కమిటీ చైర్మన్ డా.మోహన్ దాస్‌ను హైకోర్టు గత నెలలోనే ఆదేశించింది. దీంతో డాక్టర్ సైఫ్ వివరణ తీసుకునేందుకు ఆయనకు నోటీసు ఇచ్చారు. అయితే గతనెల 29న యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా హాజరుకాలేదు. ఆ విషయాన్ని మర్నాడు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా సస్పెన్షనన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. ఒక వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకున్నాక ఆంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు.
Also Read: దేశీ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు…అసలేం జరుగుతోంది?