/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/w-jpg.webp)
Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఊరూరా వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. మేళతాళాలతో భజన సంకీర్తనలు ఆలపిస్తూ చిన్నారి గణపయ్యలను వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ముస్తాబు చేసిన మండపాలలో ప్రతిష్టించారు. దీంతో ఆధ్యాత్మిక సందడితో నెలకొంది.
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వర స్వామిని బాలగణపతి రూపంతో ప్రత్యేకంగా అలంకరించి డబ్బులతో మాలను ఏర్పాటు చేసి సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామం శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మూషిక వాహన గణపతిని డప్పుచప్పులతో ఊరేగింపుగా మండపంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినాయక చవితి సందడి నెలకొంది. గణనాథుల ప్రతిమలు, పూవు, పత్రి కొనుగోళ్లతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. వరంగల్ ఎంజీఎం సర్కిల్ నుంచి ములుగు రోడ్డు అంతటా భారీ గణనాథుల కొనుగోళ్లకు పెద్ద సంఖ్యలు భక్తులు వచ్చారు. అటు హనుమకొండ, కాజీపేట చౌరస్తాలోనూ రద్దీ పెరిగింది. భారీగా గణనాథులు మండపాలకు తరలుతున్నారు. వరంగల్ నగరంలో 6200 గణనాథులు కొలువుదీరనున్నాయి. మండపాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి నేపథ్యంలో నిర్వాహకులతో వరంగల్ పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. కాజీపేట శ్వేతార్క మూలగణపతి స్వయంభు ఆలయంలో అభిషేకాలు చేస్తున్నారు.