Warangal: నా కుతురినే ప్రేమిస్తావా..? యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన సర్పంచ్..! వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కూతురు వేరే కులానికి చెందిన అబ్బాయిన ప్రేమ పెళ్లి చేసుకుందని సహించలేకపోయిన సర్పంచ్ రవీందర్.. ఆ అబ్బాయి ఇంటిపై దాడి చేసి తన అనుచరులతో నిప్పుపెట్టారు. కూతురు కావ్య ఆమె భర్త రంజిత్ కలిసి సెల్ఫీ వీడియో పంపిన తర్వాత ఈ ఘటన జరిగింది. By Trinath 05 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి వారిద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నారు.. ప్రేమించుకున్నారు.. ఇదే విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పారు. అమ్మాయి తండ్రి ఓ సర్పంచ్..! అబ్బాయిది వేరే కులం కావడంతో ప్రేమను అంగీకరించలేదు. దీంతో ప్రేమికులిద్దరు వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. తన కూతురిని ఎలాగైనా ఊర్లోకి రప్పించాలని సర్పంచ్ గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టారు. తన కూతురిని గ్రామంలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరాడు. అటు ఆమె మాత్రం ఊరికి రానని.. తమ కోసం వెతకొద్దని సెల్ఫీ వీడియో పంపించింది. వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ తన అనుచరులతో కలిసి అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టాడు. అతని స్నేహితుల ఇంటిపైనా దాడి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. యువకుడి ఇంటికి నిప్పు: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి ప్రేమ వివాహం ఉద్రిక్తలకు దారితీసింది.తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్న కావ్య,రంజిత్ తామిద్దరం క్షేమంగానే ఉన్నామని సెల్పీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపడంతో కోపంతో ఊగిపోయిన అమ్మాయి తండ్రి రాత్రి సమయంలో అబ్బాయి ఇంటితో పాటు, వారికి సహకరించిన మరో ఇద్దరి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాక్షికంగా ఇళ్లు కాలిపోయాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఇటుకాలపల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మాయి తండ్రి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్ రవీందర్. అబ్బాయిది రజకుల కులం కావడంతోనే ఈ పెళ్లికి అంగీకరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావ్య-రంజిత్ సంతోషంగానే ఉన్నాం: కావ్య తల్లిదండ్రులు తమని క్షేమించాలని.. తాము కలిసే ఉన్నామని.. ఊరి రావాలి అనుకోవడం లేదంటూ కావ్య సెల్ఫీ వీడియో పంపింది. తమ కోసం సెర్చ్ చేయవద్దని కోరింది. తాము హ్యాపీగానే ఉన్నామని సెల్ఫీ వీడియోలో చెప్పింది. కావ్య మాట్లాడుతున్న సమయంలో రంజిత్ కూడా ఆమె వెనకే ఉన్నాడు. ఇద్దరు కలిపే ఆ వీడియో పంపారు. ఆ వీడియో సంగతి ఊర్లో అందరికి తెలిసిపోతుందని..అప్పుడు తన పరువు పోతుందని రవీందర్ భావించాడో ఏమో కానీ.. ఒక్కసారిగా ఆయన కోపం కట్టలు తెంచుకుంది. తన అనుచరులకు కబురు పంపాడు. బంధువులు కూడా తోడయ్యారు. మూకుమ్మడిగా అంతా కలిసి రంజిత్ ఇంటిపై దాడి చేశారు.. ముందుగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగలేదు. ఇంటిని తగలపెట్టవరకు ఊరుకోలేదు. ఇక అక్కడితో ఈ గొడవ ముగిసిపోలేదు. వాళ్ల ప్రేమకు సహకరించారని భావించిన మరో ఇద్దరి ఇంటిపైనే దాడి చేసి నిప్పుపెట్టారు. సర్పంచ్‌నని తనని ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నాడో ఏమో కానీ.. రవీందర్ ప్రవర్తన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇళ్లు తగలపెడితే కూతురు వస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి