TDP: టీడీపీలో గోపాలపురం టికెట్‌పై వార్‌

టీడీపీలో గోపాలపురం టికెట్‌పై వార్‌ ముదురుతోంది. నల్లజర్లలో చంద్రబాబు క్యాంపు దగ్గర ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు ఆందోళన చేశారు. మద్దిపాటి మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.

New Update
TDP: టీడీపీలో గోపాలపురం టికెట్‌పై వార్‌

TDP: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు శిబిరం వద్ద మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు ఆందోళన చేపట్టారు. కన్వెన్షన్ ఎదుట గోపాలపురం అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు మాకొద్దు అంటూ ముళ్ళపూడి వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. చివరి నిమిషంలో ముళ్ళపూడి బాపిరాజుతో చంద్రబాబు భేటీ అయ్యారు.

Also Read: EMI కోసం రాళ్ల దాడి చేసిన బైక్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు..యువకుడు మృతి..!

Advertisment
తాజా కథనాలు