Viral Video: PTI మహిళా రిపోర్టర్ పై ANI ప్రతినిధి దాడి.. షాకింగ్ వీడియో విడుదల! యువ PTI మహిళా రిపోర్టర్‌పై ANI ప్రతినిధి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. NI యజమాని స్మితా ప్రకాష్ ఈ ఘటనకు స్పందించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. By Trinath 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రెస్ ఈవెంట్‌ను కవర్ చేసేందుకు వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు పరస్పరం ఘర్షణకు దిగారు. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ANI, PTI మహిళా రిపోర్టర్ మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అది కొట్టేవరకు వెళ్లింది. ANI రిపోర్టర్ PTI మహిళా రిపోర్టర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనపై పీటీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేయడం చేసింది. PTI తన పోస్ట్‌లో ANI యజమాని స్మితా ప్రకాష్‌ను ట్యాగ్ చేసింది. 'మీ రిపోర్టర్ ప్రవర్తనను ఖండిస్తారా అని ప్రశ్నించింది. తగిన చర్యలు తీసుకుంటారా లేదా అని స్మితా ప్రకాష్‌ని పీటీఐ ప్రశ్నించింది. PTI ప్రకారం ANI ప్రతినిధి మహిళా రిపోర్టర్‌ను దుర్భాషలాడారు. VIDEO | Abominable behaviour by ANI (@ANI) reporter who physically assaulted and verbally abused with sexual expletives a young PTI female reporter at a press event (@DKShivakumar @DKSureshINC) in Bengaluru today. Does ANI (@smitaprakash) condone such behaviour by its staffer?… pic.twitter.com/kZhz8MleoC — Press Trust of India (@PTI_News) March 28, 2024 పీటీఐ యాజమాన్యం ఈ విషయాన్ని మహిళా కమిషన్ ముందుంచాలని నిర్ణయించుకుంది. ఉద్యోగుల భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తానని యాజమాన్యం తెలిపింది. Also Read: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మరో 4 రోజుల కస్టడీ #pti #ani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి