Walking Backwards: ఎప్పుడైనా వాకింగ్‌ను ఇలా చేశారా..? ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు

రోజు వాకింగ్  చేయటం వల్ల ఎన్నిఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే.. సరైన పద్ధతిలో వాకింగ్‌ చేస్తేనే ఆ హెల్త్‌ ప్రయోజనాలు ఉంటాయి. లేదంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Walking Backwards: ఎప్పుడైనా వాకింగ్‌ను ఇలా చేశారా..? ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు
New Update

Walking Backwards Benefits: కొందరు వాకింగ్ చేసేటప్పుడు వెనక్కి నడుస్తూ ఉంటారు. అది చూసిన చాలామందికి వింతగా అనిస్తుంది. కానీ వెనక్కి నడవడం వల్ల ఆరోగ్య పరంగా పలు లాభాలు ఉన్నాయని నిపుణు చెబుతున్నారు. సాధారణంగా ఎవరికి ఉన్న సమయంలో వారు ఎక్సర్ సైజులు, వాకింగ్, జాగింగ్ చేస్తారు. ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలైన వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం వాకింగ్ చేస్తే ఎన్నో దీర్ఘకాలికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఎన్నో ఉపయోజనాలు ఉన్నాయి. అయితే.. ముందు వాకింగ్‌ కాదు.. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ నడక వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుద్దాం.

ఏకాగ్రతకు మంచిది

వెనక్కి వాకింగ్‌ చేయడంతో ప్రతిరోజూ ఉత్సాహంగా ఉంటారు. అయితే రోజూ చేసే వాకింగ్ కంటే వెనక్కి వాకింగ్‌ అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. కావునా ఇంకా ఇంకా నడవాలనే ఇంట్రెస్ట్ పెరిగి ఇతర వాటిపై దృష్టి పెట్టేలా బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది.

నిద్రలేమి సమస్యకు చెక్‌..

నిద్ర సరిగ్గా పొకపోతే ముఖంపై ఉండే చర్మ కణాలు అలసిపోతాయి. దాని వల్ల చర్మం ముడతలు పడిపోయి ఓల్డ్ లుక్‌కు వస్తారు. అందుకని రివర్స్‌లో వెనక్కి వాకింగ్ చేస్తే నిద్ర సమస్యలు ఉంటే వెంటనే తగ్గుతాయి. నిద్ర నాణ్యత పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

ఫాస్ట్‌గా బరువు తగ్గేందుకు ఛాన్స్

ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ప్రతీఒక్కరికి సవాలుగా మారుతోంది. బరువు తగ్గాలనుకునే ఏదో ఒక పద్ధతిని ఫాలో అవుతారు.దానినిలో భాగంగానే వెనక్కి నడవడం వల్ల అధిక కేలరీలు పోయి..బాడీలో కొవ్వు ఫాస్ట్‌గా కరుగుతుంది. ఇలా చేయటం వలన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.

జీవన శైలిలో ఎలాంటి మార్పు తీసుకురాకపోవడంతో బరువు తగ్గలేకపోతున్నారు. కొన్ని రకాల వ్యాయామాలు, ఆహార నియంత్రణ వంటి పనులు రెగ్యులర్‌గా చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చు.

అధిక కొవ్వుకు చెక్‌

చాలామంది కొవ్వు, బరువు తగ్గటానికి ముందుకు వాకింగ్‌ చేస్తారు. అయితే.. వెనక్కి వాకింగ్ చేస్తే 40 శాతం అధికంగా శక్తి పొతుంది. దీని వలన త్వరగా కొవ్వు కరుగుతుంది. అందుకని వెనక్కి నడిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి.

మోకాలి నొప్పులు దూరం

వెనక్కి వాకింగ్ వల్ల మోకాలి నొప్పులు తగ్గుతాయి. వెనక్కి పరిగెత్తడం, వాకింగ్ చేయడం వల్ల కార్డియోస్పిరేటరీ బలంగా మారుతుందని ఓ అధ్యయనంలో పేర్కొన్నారు.

కాళ్ల కండరాలు దృఢంగా..

కాళ్ల కండరాలు దృఢంగా ఉండాలంటే వెనక్కి నడవడం చాలా మంచిది. కాలి పిక్కలు, మడమల దగ్గర కండరాలు పటుత్వం పెరుగుతుంది.

గమనిక: అవగాహన కోసం ఇది నిపుణులు, అధ్యయనాల సమాచారం మాత్రమే. ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: ఈ ఆకుకూర ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి..ఎందుకంటే..?

#walking-backwards #health-benefits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe