/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/vyjayanthi.jpg)
Vyjayanthi Movies: గత దశాబ్దాల కాలంగా ఎప్పుడూ లేనంత విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది.సుమారు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహంతో నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. విజయవాడ నగరంతో పాటు అనేక గ్రామాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో 'ఆయ్' చిత్ర బృందం వరద బాధితులకు ఆర్ధిక సాయం చేయాలని ముందుకు వచ్చింది. అంతేకాకుండా సోమవారం నుండి ఆదివారం వరకూ 'ఆయ్' సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా ఇస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Let's strive for a better tomorrow.@AndhraPradeshCMpic.twitter.com/AvneI83YAo
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 2, 2024
ఇదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇచ్చింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. "ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత" అని పేర్కొంది.
Also Read: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..!
Follow Us