VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

వచ్చే రెండు, మూడు నెలలు భారత క్రికెట్ అభిమానులకు పండగే పండగ. వరుస మెగా టోర్నీలతో బోలెడంత వినోదంతో పాటు టెన్షన్ లభించనుంది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 19 దాకా టీమిండియా క్రికెటర్లు బిజీ బీజీగా ఉండనున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు.

New Update
VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా క్రీడలకు మాత్రమే..

వచ్చే రెండు, మూడు నెలలు భారత క్రికెట్ అభిమానులకు పండగే పండగ. వరుస మెగా టోర్నీలతో బోలెడంత వినోదంతో పాటు టెన్షన్ లభించనుంది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 19 దాకా టీమిండియా క్రికెటర్లు బిజీ బీజీగా ఉండనున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా దిగ్గజ తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. తొలిసారిగా ఆసియా క్రీడల్లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ క్రికెటర్లు ఆసియా కప్, వరల్డ్‌ కప్ టోర్నీలకు అందుబాటులో ఉండటంతో జూనియర్ క్రికెటర్లను ఈ టోర్నీకు ఎంపిక చేసింది.

లక్ష్మణ్ కోచింగ్‌లో U-19 ప్రపంచకప్ కైవసం..

ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న లక్ష్మణ్ టీమిండియాతో పాటు ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్నాడు. లక్ష్మణ్‌తో పాటు సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి కూడా కోచింగ్ సిబ్బందిలో ఉన్నారు. సాయిరాజ్ బౌలింగ్ కోచ్‌గా.. మునీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. గతంలోనూ ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలతో పాటు స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లకు లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అంతేకాకుండా భారత అండర్ 19 జట్టుకు కూడా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే 2021 అండర్ 19 ప్రపంచకప్‌ను భారత యువ జట్టు గెలిచింది. ఆసియా క్రీడల్లో జరిగే ద్వితీయశ్రేణి జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కానుండగా.. పురుషుల ఈవెంట్ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభంకానుంది.

టీమిండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు