భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైన ఓటింగ్..!! పశ్చిమ బెంగాల్‌లో మూడంచెల పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 జిల్లాల్లో ఒకే దశలో ఓటింగ్ ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీ సమితిల్లోని దాదాపు 74 వేల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. By Bhoomi 08 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి బెంగాల్లో మూడంచెల పంచాయతీ ఎన్నికల కోసం, జూలై 8, శనివారం నాడు మొత్తం 22 జిల్లాల్లో ఒకే దశలో ఓటింగ్ ప్రారంభమైంది. గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీ సమితికి చెందిన దాదాపు 74 వేల స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. మరోవైపు, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుండి, గత 28 రోజులుగా ఉత్తర బెంగాల్ నుండి దక్షిణ బెంగాల్ వరకు వివిధ ప్రాంతాలలో చోటుచేసుకున్న హింసతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నికల హింసలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కూచ్‌బెహార్, ముర్షిదాబాద్ తదితర జిల్లాల్లో పోలింగ్‌కు ఒకరోజు ముందు శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గురువారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ హింసాత్మక ముర్షిదాబాద్‌ను గవర్నర్ సివి ఆనంద్ బోస్ శుక్రవారం సందర్శించారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన హింసాత్మక ఘటనల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ టిఎంసి, బిజెపి, కాంగ్రెస్, వామపక్ష అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అయినప్పటికీ టిఎంసి గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టింది. హింసాకాండను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు ఆదేశాలతో, బెంగాల్ పోలీసులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ రోజున కేంద్ర బలగాలను కూడా మోహరించారు. మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 9,730 పంచాయతీ సమితి స్థానాలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రకటన తర్వాత మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. ఈ హింసాకాండకు టిఎంసి కార్యకర్తలు కారణమని ఆరోపిస్తుండగా, మమత పార్టీ బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలను నిందిస్తోంది. అటు 22 జిల్లాల్లో లక్షా 35 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు, వీరిలో 65 వేల మంది సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. Your browser does not support the video tag. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి