/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/voter-slaps-mla-1.jpg)
Voter Slaps MLA: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 20 శాతం ఓట్లు పోలయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఏపీలో చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలిలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెనాలిలో ఒక ఓటరు ఎమ్మెల్యే చెంప పగులగొట్టారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
క్యూలైన్ లో రాని ఎమ్మెల్యే..
Voter Slaps MLA: తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పెద్ద క్యూ లైన్ ఉంది. ఎమ్మెల్యే శివకుమార్ అక్కడకు ఓటు వేసేందుకు తన అనుచరులతో కలిసి వచ్చారు. క్యూ లైన్ లో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఒక ఓటరు ఆయనను అడ్డుకున్నారు. క్యూలైన్ లో రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరును కాలరు పట్టుకుని చెంపపై కొట్టారు. ఆ దెబ్బ పడిన వెంటనే ఆ ఓటరు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఎమ్మెల్యే చెంప పగుల గొట్టారు. తిరిగి ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరును వరుసగా దెబ్బలు కొట్టడం ప్రారంభించారు. ఇంతలో ఆయన వెంట ఉన్న అనుచరులు ఆ ఓటరును విచక్షణా రహితంగా కొట్టుకుంటూ అక్కడ నుంచి బయటకు లాగేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Follow Us