ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచిన అధికారులు.. ఆ తేదీలోపే అందిస్తారట తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచారు అధికారులు. ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ నవంబర్ 20లోగా పూర్తి కావాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్ వి నాయక్ ఆదేశాలు జారీ చేశారు. By srinivas 08 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Voter Card : తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచారు అధికారులు. ఈ మేరకు ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ నవంబర్ 20లోగా (November 20) పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వీలైనంత త్వరగా కార్డులను స్పీడు పోస్టులో పంపించి సదరు వ్యక్తులకు అందేలా చూడాలని చెప్పారు. అలాగే కార్డులను ఓటర్లకు పంపిణీ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్ వి నాయక్ (Ajay V Nayak) తెలిపారు. Also Read :టీవీ చూడొద్దని మందలించిన తండ్రి.. క్షణికావేశంలో యువతి దారుణం ఈ మేరకు నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మాట్లాడిన అజయ్ వి నాయక్.. 'కార్డులను ఓటర్లకు స్పీడు పోస్టులో పంపాలి. వాటిని పంపిణీ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలి. పోలింగు ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల్లో ఇతర ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు (EVM) లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి' అని వివరించారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి షాడో రిజిస్టర్లను విధిగా అమలు చేయాలని ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ఆర్.బాలకృష్ణన్ సూచించారు. అలాగే సాంకేతిక కారణాలతో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అనుమతులు నిరాకరించవొద్దని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ (Vikas Raj) తెలిపారు. ఇక ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి చివరి దాకా శిక్షణలు నిర్వహించాలని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రాకు సూచించారు అజయ్ వి నాయక్. #voter #identity-cards #completed #november-20 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి