E Voter Card Download Process: కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల(Elections) నగారా మోగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బిజీబిజీగా ఉంది. ఎన్నికల తేదీలు కూడా వచ్చేశాయి. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ(Voter ID) తప్పనిసరి. ఇంతకు ముందు ఉన్న ఓటర్ల లిస్ట్ ను కేంద్రం రెడీ చేసి విడుదల చేయగా..కొత్తగా ఓటుకు అప్లై చేసుకున్న వారికి పోస్టుల ద్వారా కార్డులను ఇంటికి పంపేశారు.
ఈ క్రమంలోనే ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (EC) గుడ్ న్యూస్ చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈ - ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు కూడా. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది.
Also read: ట్రైన్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్..దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు!
కేవలం మొబైల్ నెంబర్ ఉపయోగించి ఈ ఓటర్ గుర్తింపు కార్డును పొందవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ - ఓటర్ ని పొందడానికి కూడా ఫామ్ 8 నే ఉపయోగించాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. అప్లికేషన్ ఫామ్ లో మొబైల్ నంబర్ ను ఎంట్రీ చేసేందుకు ప్రత్యేకంగా ఓ కాలమ్ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఫామ్ ని పూర్తి చేసిన తరువాత సబ్‌మిట్ చేయాలని వివరించారు. https://voters.eci.gov.in/ లో e-epic విభాగంలోకి వెళ్లి ఎక్కడైతే ఎన్నికల తెలిపిందో అక్కడ ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలని వివరించింది. మొబైల్ నంబర్ కు ఓటీపీ రాగానే దానిని ఎంటర్ చేస్తే ఈ - ఓటర్ గుర్తింపు కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది.
ఎన్నికల సంఘం ఇచ్చే ఓటు గుర్తింపు కార్డు కోసం వేచి చూడకుండా ..ఈ - ఓటరు గుర్తింపు కార్డు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఆ సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరింత ఈజీ చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ- ఓటరు గుర్తింపు కార్డు చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.