TS Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also read: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి!
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. అయితే, దూర ప్రయాణం నుంచి వచ్చే ఓటర్లు, పెద్ద వయసులో ఉన్న వారు సమయానికి పోలింగ్ బూత్‌కు రాకపోతే ఓటర్లకు అధికారులు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా? ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారా? లేదా? తెలియాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు ఎట్టిపరిస్ధితిలోనూ లోపలికి అనుమతించరు. ఒకవేళ వేసినా ఆ ఓట్లను లెక్కలోకి తీసుకోరు. కానీ, సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర క్యూలో నిలబడితే మాత్రం ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారు. కనుక ఎన్నికల రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేదంటే ఓటు హక్కును కోల్పోతారు.