Vodafone Idea's Rs 202 plan: కేవలం రూ.202తో 13 OTTలు.. వోడాఫోన్ ఐడియా సంచలన న్యూఇయర్ ఆఫర్!

ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా OTT అభిమానుల కోసం 202 రూ. సరి కొత్త ప్లాన్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 202 రూ. ప్రీమియం చెల్లింపుతో ఒకేసారి 13 OTT ఛానెల్స్, వీఐ మూవీస్​ & టీవీ సబ్​స్క్రిప్షన్​ను పొందవచ్చు.

New Update
Vodafone Idea's Rs 202 plan: కేవలం రూ.202తో 13 OTTలు.. వోడాఫోన్ ఐడియా సంచలన న్యూఇయర్ ఆఫర్!

Vodafone Idea's Rs 202 plan: ఇటీవలే ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారుల కోసం జియో టీవీ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకువచ్చింది. జియో టీవీ ప్రవేశ పెట్టిన ఈ ప్లాన్ లో 398 ప్రీమియం చెల్లించి ఒకేసారి 14 ఓటీటీ ఛానెల్స్ చూసే అవకాశాన్ని అందించింది. ఇక ఇప్పుడు మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ఓటీటీ అభిమానుల కోసం సరి కొత్త 202 రూపాయల ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ ఓటీటీ సినీ ప్రియులకు వినోద అనుభవాన్ని అందించడం పై ద్రుష్టి పెట్టింది. కేవలం 202 రూపాయల ప్రీమియం చెల్లింపుతో 13 ఓటీటీ ఛానెల్స్, వీఐ మూవీస్​ & టీవీ సబ్​స్క్రిప్షన్​ పొందే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించింది. ఈ ప్లాన్ పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Amazon Prime : అమెజాన్ ప్రైమ్ వాడేవారికి గుడ్ న్యూస్.. సబ్‌స్క్రిప్షన్‌ ధర తగ్గింపు.. కొత్త ధరలివే!

ఈ 202 రూపాయల ప్లాన్ కేవలం వీఐ మొబైల్ యాప్ లో మాత్రమే కనిపిస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా మాత్రమే వీఐ మూవీస్​ & టీవీ సబ్​స్క్రిప్షన్​ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఓటీటీ లవర్స్ కు ఇది బంపర్ ఆఫర్. ప్రతీ ఓటీటీ ఛానెల్స్ కు సెపెరేట్ గా ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా.. వోడాఫోన్ ఐడియా అందించిన.. కేవలం 202 రూపాయల ప్లాన్ తో ఒకేసారి 13 OTT ఛానెల్స్ కంటెంట్ పొందవచ్చు. వీటిలో సోనీ లివ్, జీ5, డిస్నీ హాట్ స్టార్, సన్ నెక్స్ట్, హంగామా వంటి 13 ఓటీటీ ఛానెల్స్ సేవలను పొందవచ్చు. కానీ ఈ ప్లాన్ ప్రయోజనాలు కేవలం వీఐ(vi) వినియోగదారులకు మాత్రమే లభించడం గమనార్హం. అంతే కాదు వోడాఫోన్ అందిస్తున్న 202 రూపాయల ప్లాన్ ద్వారా సర్వీస్ వ్యాలిడిటీ, డేటా, వాయిస్ కాలింగ్ వంటి సదుపాయాలు లభించవు. ఈ ప్లాన్ కేవలం ఒక నెల రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది

Also Read: Paytm: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Advertisment
తాజా కథనాలు