/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/j2-2-jpg.webp)
Vizianagaram : విజయనగరంలో టెన్షన్ వాతవారణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తు రోడెక్కారు జనసేన శ్రేణులు. జగన్ ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. నిరసన చేస్తున్నా జనసేన మహిళలను పోలీసులు అదుపు చేస్తున్నారు. అయితే, ఆందోళన చేపట్టిన జనసైనికులను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఏపీ సీఎం జగన్ విజయనగరం పర్యటనను అడ్డుకుంటామంటున్నారు జనసైనికులు.
ఏపీ సీఎం జగన్ విజయనగరం పర్యటన చేపట్టారు. విజయనగరంలో ఆయన మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. అక్కడ దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచే వర్చువల్ గా రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదక మీద నుంచి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండేలా వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Follow Us