Learjet aircraft Skids Off Runway At Mumbai Airport, All Operations Shut: 8 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న బొంబార్డియర్ లియర్‌జెట్ ప్రైవేట్ జెట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే స్కిడ్ అయ్యింది.
This browser does not support the video element.
ఈ ప్రమాద సమయంలో విమానంలో 6 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ముంబై ఎయిర్‌పోర్ట్ షట్‌డౌన్ చేశారు. VSR వెంచర్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌గా గుర్తించారు. విశాఖ నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇది.
వైజాగ్-ముంబై నుంచి నడుపుతున్న VSR ఏవియేషన్ లీర్‌జెట్ 45 విమానం VT-DBL నగరంలో భారీ వర్షాల కారణంగా ల్యాండ్ అయిన తర్వాత టాక్సీ వే వద్ద దారి తప్పి స్కిడ్ అయ్యింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. భారీ వర్షంతో విజిబిలిటీ 700మీ. గా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని DGCA ప్రకటించింది.
ముంబై విమానాశ్రయంలో భారీ వర్షాల మధ్య ల్యాండ్ అవుతున్న సమయంలో చార్టర్డ్ విమానం రన్‌వేపై నుంచి దారి తప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ వర్షంతో 700 మీటర్ల విజిబిలిటీ ఉందని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ధృవీకరించింది.
DGCA ప్రకారం.. VSR ఏవియేషన్ అనేది న్యూఢిల్లీకి చెందిన ఒక సంస్థ. ఇది కార్పొరేట్ ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి సురక్షితమైన విమాన ప్రయాణాలను అందిస్తుంది.
కంపెనీ MOCA, MHA, DGCA, DGFT, BCAS, AAIతో అనుసంధానం చేస్తుంది. సమన్వయం చేస్తుంది.
లియర్‌జెట్ గురించి మరిన్ని వివరాలు:
1950లలో ఈ జెట్ గాల్లోకి ఎగిరింది. కెనడాకు చెందిన ఎయిరోస్పెస్ యాజమాన్యం ఈ జెట్‌ని తయారీచేసింది. పౌర, సైనిక ప్రయోజనాల కోసం ప్రైవేట్, లగ్జరీ విమానాలను నిర్మించిన మొదటి కంపెనీలలో ఇది ఒకటి. 1990 నుంచి కెనడియన్ బొంబార్డియర్ ఏరోస్పేస్ అనుబంధ సంస్థగా ఉంది. ఫిబ్రవరి 2021లో, బొంబార్డియర్ అన్ని కొత్త లియర్‌జెట్ విమానాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ మార్చి 2022లో లియర్‌జెట్ విమానం లాస్ట్ డెలివరీని ఇచ్చింది.
ALSO READ: కాక్‌పిట్ లో పొగలు..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!