CM Jagan: జగన్ పై రాయి దాడి.. విజయవాడ సీపీ కీలక ప్రెస్ మీట్-LIVE

సీఎం జగన్ పై దాడి ఘటనపై విజయవాడ సీపీ క్రాంతిరాణా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ కేసు దర్యాప్తు, సేకరించిన ఆధారాల వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు.

New Update
CM Jagan: జగన్ పై రాయి దాడి.. విజయవాడ సీపీ కీలక ప్రెస్ మీట్-LIVE

సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 13న సీఎం జగన్ (CM Jagan) మేమంతా సిద్ధం విజయవాడలో జరిగిందన్నారు. మొత్తం 22 కి.మీ. ఈ రోడ్ షో ప్లాన్ చేసినట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై.. రాత్రి 10 గంటల వరకు సాగిందన్నారు. అయితే సాయంత్రం 4.30 గంటలకు వర్షం పడిందన్నారు. 1480 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రోడ్డుకు ఇరువైపులా 880 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించినట్లు చెప్పారు. 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. వీఐపీ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్న సమయంలో పవర్ తీయడం సహజమన్నారు.

వర్షం కారణంగా మరికొన్ని చోట్ల పవర్ తీశారన్నారు. ఆ సమయంలో చీకటి ఉండడానికి కారణం ఇదేనన్నారు. రాత్రి 8.04 గంటలకు వివేకానంద స్కూల్ దగ్గర ఒక వ్యక్తి జగన్ పైకి రాయిని విసిరారన్నారు. ఆ రాయి సీఎం ఎడమ కంటిపైన తగిలిందన్నారు. అదే రాయి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా తగిలిందిన్నారు. వెల్లంపల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సీసీ టీవీ ఫుటేజీతో పాటు 50-60 సెల్‌ ఫోన్లలో వీడియో రికార్డులను పరిశీలించామన్నారు. 50-60 మంది అనుమానితులను విచారించామన్నారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది. లైవ్ కోసం కింద వీడియో చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు