Viswak Sen : గోదావరి యాస నేర్చుకోడానికి అన్ని రోజులు పట్టింది.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం విశ్వక్ సేన్ కష్టం!

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. గోదావరి యాస నేర్చుకోడానికి తాను 20 రోజులు కష్టపడ్డానని, ఆ భాషలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకున్నానని చెప్పాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

New Update
Viswak Sen : గోదావరి యాస నేర్చుకోడానికి అన్ని రోజులు పట్టింది.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం విశ్వక్ సేన్ కష్టం!

Viswak Sen About Godavari Slang: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty), అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్ సేన్ మాస్ అవతార్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఇక మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో టీమ్ తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ సినిమా కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు.

Also Read : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా?

20 రోజుల్లో గోదావరి యాస నేర్చుకొని...

తాజా ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. " ఈ సినిమాలో గోదావరి యాసను ప్రజెంట్ చేసేందుకు 20 రోజులు కష్టపడ్డా.. ఆ భాషలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకున్నా. జనాలు విశ్వక్‌సేన్ కేవలం తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాత్రమే సినిమాలు చేస్తారని అనకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డా.

నా యాసలో ప్రేక్షకులు ఎలాంటి తప్పులు గుర్తించరని చాలా నమ్మకంగా ఉన్నా. నేను అన్ని రకాల యాసల్లో సినిమాలు చేయాలని.. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా మక్కువతో ఉన్నాను. నేను ఏ యాసనైనా మాట్లాడతానని గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి నిరూపిస్తుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు