Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..

విశ్వకర్మ జయంతి సందర్భంగా అనేక వృత్తుల్లో ఉన్న వివిధ వర్గాల వారి జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమమే ప్రధాని విశ్వకర్మ యోజన పథకం అని పేర్కొన్నారు ఎంపీ లక్ష్మణ్.

Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..
New Update

Viswakarma Yojana Scheme Benefits: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, చేతివృత్తుల మీద ఆధారపడి ఉందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. గత పాలనలో కుల, చేతి వృత్తుల వర్గాలను విస్మరించి, కనీస శ్రద్ధ చూపలేదన్నారు. నైపుణ్యత ఆసరాగా అనాదిగా వృత్తిలో కొనసాగుతున్నారని, భూములు కోల్పోయారని అన్నారు. పెట్టుబడి దారులకు, పెత్తందారులకు పెద్ద పీట వేసే నేటి పోటీ ప్రపంచంలో కుల వృత్తుల వారు తమ వృత్తి లోనే ఉంటూ దుర్భరమైన జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. చేతి వృత్తుల వారి జీవితాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. తానే పెద్ద దిక్కుగా నిలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. కుల వృత్తులను ఆధునీకరించి, ఆర్థిక సాయం అందించి, ఆధునిక పరికరాలు అందించే విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ, విశ్వకర్మ జయంతి సందర్భంగా అనేక వృత్తుల్లో ఉన్న వివిధ వర్గాల వారి జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమమే ప్రధాని విశ్వకర్మ యోజన పథకం అని పేర్కొన్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ పథకం దేశ వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే పథకం అని చెప్పుకొచ్చారు. ఈ పథకంలో భాగంఆ ఉచిత శిక్షణ, శిక్షణ వ్యయం, నైపుణ్య శిక్షణ, 3 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే అందిస్తారని వివరించారు ఎంపీ లక్ష్మణ్. కుల వృత్తులు కూడా పెద్ద కంపెనీల గుప్పిట్లో నలిగిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ.. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కొత్త ఆలోచనలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. శిక్షణ, నైపుణ్యం, మార్కెటింగ్ కూడా చేసే విధంగా సంకల్పంతో పని చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న ఈ పథకానికి శ్రీకారం చుడుతుండగా.. ఓబీసీ మోర్చ ద్వారా ఈ పథకాన్ని ప్రత్యక్షంగా ఆయా వర్గాల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యక్షంగా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఎంపీ లక్ష్మణ్. కేంద్ర మంత్రులు 70 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వివరించారు.

ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు శిల్పకళా వేదికలో జరుగబోయే కార్యక్రమంలో పాల్గొంటారు. వరంగల్‌లో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ రతన్ పాల్గొంటారు. ఓబీసీ మోర్చా తరఫున ర్యాలీలు, పాలాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ కేంద్రాల్లో 16వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించి.. విశ్వకర్మ పథకంలో సమాంతరంగా ప్రభుత్వంతో పాటు బీజేపీ పాల్గొంటుందని వివరించారు లక్ష్మణ్.

ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 140 జాతులు, 18 వృత్తులు వారు లబ్ది పొందుతారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వ రంగ సంస్థలు kvic, msme లాంటివి ఇందులో పాల్గొంటూ లబ్ధిదారులకు అండగా ఉంటాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ద్వారా లబ్దిదారుల ఎంపిక జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందులో పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు లక్ష్మణ్. ఇక ఈ పథకంలో భాగంగా 15 రోజుల పాటు ఉచిత భోజనంతో నైపుణ్య శిక్షణ, సర్టిఫికేట్, రూ. 15 వేలు విలువచేసే ప్రత్యేక కిట్స్, రూ. 3 లక్షల లోన్ వచ్చే విధంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు.

Also Read:

Andhra Pradesh: అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నారు.. హోంమంత్రి వనిత సంచలన కామెంట్స్..

Telangana: మరో కీలక పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యార్థులకు ఇక నుంచి..

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe