Gaami Trailer: అసలు నేను ఎవరు..? అంతు చిక్కని సమస్యతో విశ్వక్ సేన్.. ఆసక్తికరంగా గామీ ట్రైలర్

విద్యాధర్ కగిత దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం గామీ. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.  

Gaami Trailer: అసలు నేను ఎవరు..? అంతు చిక్కని సమస్యతో విశ్వక్ సేన్.. ఆసక్తికరంగా గామీ ట్రైలర్
New Update

Gaami Trailer: డైరెక్టర్ విద్యాధర్ కగిట దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'గామీ'. విశ్వక్ సేన్ అఘోరగా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా రిలీజైన గామీ ట్రైలర్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. అంచనాలకు తగ్గట్లే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గామీ ట్రైలర్

అసలు నేను ఎవరు..? ఎక్కడ ఉన్నాను.. నాకు ఏమీ గుర్తుకు రావడంలేదు అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. విశ్వక్ సేన్ సమస్యకు పరిష్కారం దొరకదని భావించిన కొంత మంది అఘోరాలు.. అతన్ని వెంటనే హిమాలయాలకు బయలుదేరమని చెప్తారు. ఆ తర్వాత కారాగారంలో బంధించిన కొంత మంది వ్యక్తుల సన్నివేశాలు సస్పెన్స్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. సమస్యతో హిమాలయాలకు బయలుదేరిన విశ్వక్ సేన్ కు.. ఒక సాధువు ద్వారా తన సమస్యకు పరిస్కారం దొరుకుంతుంది. హిమాలయాల్లో ద్రోణగిరి అనే పర్వతం పై 36 సంవత్సరాలకు ఒక సారి తాళి పత్రాలు వికసిస్తాయి. మానవ స్పర్శతో అవి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలవు అని చెప్తాడు. ఆ తాళి పాత్రల కోసం హిమాలయాలకు బయలుదేరిన హీరో.. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు అనేదే ఈ కథ అన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ లోని ప్రతీ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాయి. సినిమా పై తీవ్ర ఆసక్తిని పెంచుతున్నాయి .

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

#gaami-trailer #gaami
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe