విశ్వక్ సేన్ కొత్త సినిమా రెడీ

విశ్వక్ సేన్ తాజా చిత్రం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు.

విశ్వక్ సేన్ కొత్త సినిమా రెడీ
New Update

విశ్వక్ సేన్ తాజా చిత్రం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ షెడ్యూల్ ముగిసిన తర్వాత, ప్రకటన రావడంతో చాలామందికి సినిమా గురించి తెలిసొచ్చింది.

Vishwak Sen new movie title

ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. తాజాగా విశ్వక్ సేన్ లుక్ ను కూడా విడుదల చేశారు. గంభీరమైన లుక్ లో సీరియస్ గా కనిపిస్తున్నాడు విశ్వక్. అతడి హెయిర్ స్టయిల్ కూడా పూర్తిగా మారిపోయింది.

ఈ సందర్భంగా మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 6న ఈ సినిమా టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. అదే రోజున సినిమా గ్లింప్స్ కూడా రాబోతోంది. ఆగస్ట్ 6న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం సెట్ చేశారు.

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. దాస్ కా ధమ్కీకి కూడా ఇతడే సంగీతం అందించాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe