వరుడు కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!

ఈ మధ్య కాలంలో యువ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ స్టార్ చేరాడు. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించాడు.

New Update
వరుడు కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో!

తెలుగు యువ హీరోలు వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. రానా, నిఖిల్, నితిన్, శర్వానంద్ దాంపత్య జీవితంలోకి ఎంటర్ అయ్యారు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ సైతం ఇటీవలే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

"ఇన్నాళ్ల నుంచి నా పై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలోని మరో ఘటాన్ని ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను" అంటూ ఆ పోస్టులో తెలిపాడు. మరి మంగళవారం ఎలాంటి వార్త చెబుతాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా పెళ్లి వార్తే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

విశ్వక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. గామి చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలో అఘోరగా నటించాడు. చాందిని చౌదరి హీరోయిన్‌గా చేస్తుంది. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తున్నాడు. అంజలి, నేహశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీలో విశ్వక్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. వీటితో పాటు కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుండగా మీనాక్షి చౌదరి జోడిగా చేస్తుంది.

ఇక ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న ‘ధమ్కీ’ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ.8కోట్లతో తీసిన ఈ సినిమాకు దాదాపు రూ. 2.50కోట్ల మేర లాభాలు వచ్చాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు విశ్వక్‌సేన్‌ దర్శకత్వం వహించడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు