Vizag Drugs : విశాఖ(Vizag) లో డ్రగ్స్(Drugs) బానిసలుగా పదోతరగతి విద్యార్థులు(10th Class Students) మారడం వెనక ఎవరున్నారు అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయన్నారు బిజెపి(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju). దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలోనే ఉంటున్నాయన్నారు. ఎన్నికల కోడ్(Election Code) రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ డ్రగ్స్ ముఠా రట్టయ్యిందన్నారు. ఎన్నికల కోడ్ లేనట్లయితే.. డ్రగ్స్ డొంక కదిలేది కాదన్నారు. విశాఖలో టెన్త్ స్టూడెంట్స్ డ్రగ్స్ బారినపడిన మాట వాస్తవం అన్నారు. ఈ డ్రగ్స్ ను విశాఖకు ఎవరి తీసుకువచ్చారు.. దీని వెనక ఎవరున్నారు అనే విషయాలన్నీ కూడా త్వరలోనే దర్యాప్తులో బయటపడుతాయన్నారు. సీబీఐ(CBI) దర్యాప్తులో అన్ని విషయాలను బయటకు వస్తాయంటున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తో ఆర్టీవీ సంచలన ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి : యూట్యూబ్ లో రెండు డైలాగులు కొడితే వారసుడివి కాలేవు..సిద్దార్థ్ రెడ్డిపై శబరి పంచ్‌లు.!