Vishakha: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధం: వై.వీ సుబ్బారెడ్డి

విశాఖపట్నంలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించిన ఆయన టీడీపీపై పలు కీలక ఆరోపణలు చేశారు.

New Update
Vishakha: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధం: వై.వీ సుబ్బారెడ్డి

రాజధాని లేకపోవడానికి చంద్రబాబుదే కారణం

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ప్రత్యేక పూజులు వై.వి.సుబ్బారెడ్డి ( (YV Subba Reddy)నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగించనున్నారని పేర్కొన్నారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని పూజులు చేశామన్నారు. మరల జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని గణనాధుడిని పూజించాం వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. మూడు రాజధానులకు న్యాయపరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందన్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదే (chandrababu)అని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రా ప్రజలకు భరోసా కల్పించనున్నాం వై.వి.సుబ్బారెడ్డి వివరించారు. దక్షిణభారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని ఆయన పేర్కొన్నారు.

మాకు పూర్తి నమ్మకం

విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖను రాజధానికి అనుకూలంగా ఉంటుందనే కేంద్రం కూడా విశాఖను అభివృద్ధి చేయనుందన్నారు. చంద్రబాబు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కోర్టులుపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. టీడీపీ ఎంతో ఇబ్బందుల్లో ఉందన్నారు. టీడీపీ (tdp)ని నడిపించడానికి వేరొక నాయకుడికి అప్పగించిన పరిస్థితి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు ఉన్నా వైసీపీ (ycp) ప్రభుత్వం సిద్ధంగా ఉందని వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు.

కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు

అయితే నిన్న జరిగిన ఏపీ కేబినెట్‌ (AP Cabinet)సమావేశంలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలను ఆమోదించిందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన( Administration from Visakha) ప్రారంభిస్తామన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని సీఎం నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని కూడా నియమించాలని సీఎం జగన్‌ ( cm jagan) ఆదేశించారు. ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామని సీఎం జగన్‌ ఏపీ కేబినెట్‌ సమావేశంలో వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు