AP: వైసీపీ అభ్యర్థి బొత్స నామినేషన్.. టీడీపీ అభ్యర్థి ఎవరు?

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. టీడీపీ ఎందుకు పోటీలో ఉండాలనుకుంటుందో తెలియడం లేదని బొత్స అన్నారు. వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందన్నారు.

New Update
Botsa Sathya Narayana: ఆ రెండు పత్రికలు ప్రజల్ని ఫుల్స్ చేస్తున్నాయి: బొత్స

Also Read: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

బొత్స సత్యనారాయణ వైసీపీ శ్రేణులతో కలిసి నామినేషన్‌ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపితే దుశ్చర్యకు పాల్పడినట్లేనని అన్నారు.  వైసీపీకి 530కి పైగా ఓట్ల బలం ఉందని..టీడీపీకి ఉన్న బలం కేవలం 300 ఓట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. టీడీపీ ఎందుకు పోటీలో ఉంటుందో తెలియడం లేదన్నారు. టీడీపీ బిజినెస్‌మెన్‌ను తీసుకొచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతుందని..రాజకీయాలు అంటే వ్యాపారమా? అంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు.

Also Read: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్‌ దాడి..ఎక్కడంటే!

మరోవైపు రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తున్నప్పటికి టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ, విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు