Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఓ నిరు పేద కుటుంబం కూలి పనులు చేస్తూనే కొడుకు పైడి రాజశేఖర్ ను కెమికల్ ఇంజనీరింగ్ (Chemical Engineering) చదివించారు. అనకాపల్లి (Anakapalle) లోని అచ్యుతాపురం (Atchutapuram) ఎసెన్షియా ఫార్మా కంపెనీ (Escientia Pharma Company) లో తనకు జీతం రూ. 5 వేలు ఎక్కువ వస్తుందని 25 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు.. ఇక పెళ్ళి చేస్తే సరిపోతుందని అనుకున్నారు కుటుంబసభ్యులు. అయితే, ఇంతలో పెను విషాదం చోటుచేసుకుంది.
Also Read: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన!
ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో కెమికల్ ఇంజనీర్ పైడి రాజశేఖర్ మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. రాజశేఖర్ కోసం గుండెలు బాదుకుంటున్నారు. RTVతో పైడి రాజశేఖర్ తాతయ్య మాట్లాడుతూ రోదించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు అవసరం లేదని తమ మనవడిని చూపిస్తే చాలని అన్నారు.