Visakha: విశాఖలో హైటెన్షన్.. మైనర్ రేప్ కేసులో ప్రియుడి కోసం పోలీసుల వేట.!

విశాఖ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు ఇమ్రాన్ అతని ఫ్రెండ్ షోయబ్ కోసం స్పెషల్ టీమ్స్ ఛత్తీస్‌గఢ్ వెళ్లారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ విశాఖలో మహిళ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.

New Update
Visakha: విశాఖలో హైటెన్షన్.. మైనర్ రేప్ కేసులో ప్రియుడి కోసం పోలీసుల వేట.!

నూతన సంవత్సరం రోజే ఏపీలో దారుణం జరిగింది. విశాఖపట్నం జిల్లా పరిధిలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. బ్రతుకుదెరువు కోసం వలస వచ్చిన దళిత బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన యువకుడు దారుణంగా మోసం చేశాడు. పార్టీ పేరుతో పిలిచి తన స్నేహితులతో కలిసి క్రూర మృగల్లాగ లైగింక దాడికి పాల్పడ్డారు.

Also Read: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో కొంతకాలంగా నివాసం ఉంటోంది. అయితే 17 ఏళ్ల బాలిక రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పని చేస్తోంది. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లే ఆమె ప్రియుడు డిసెంబర్ 18న కూడా నాలుగొవ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి మొదటగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ను పిలిచి లైగింక దాడి చేయించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తూ కనిపించింది. పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఎనిమిది మంది బాలికను రెండు రోజులపాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఆ అమ్మాయి వారి నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన నాల్గో పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. మానసిక ఆందోళన, భయంతో తల్లిదండ్రులతోనూ విషయం చెప్పలేదు. అయితే ఈ ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన ఎనిమిది మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ భయంకరమైన ఘటన ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు