Vishaka: ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి లభ్యం.. అదుపులో ఏడుగురు విద్యార్థులు! విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. గురువారం రాత్రి సమాచారం అందగానే వెళ్ళి తనిఖీలు నిర్వహించగా హాస్టల్ గదిలో గంజాయి సిగరెట్ పీకలు, 5 గ్రాముల గంజాయి లభించినట్లు సీఐ వెల్లడించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 23 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ganja in Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మరోసారి గంజాయి లభించడం కలకలం రేపింది. ఇప్పటికే ఏయూ డగ్స్ కు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా క్యాంపస్ లో విద్యార్థులే గంజాయి సరాఫరా చేస్తున్న విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. గతంలోనూ గంజాయి విక్రయిస్తూ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు తోపాటు మరో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుపడగా ఈసారి ఏడుగురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హస్టల్ లో 7గురు విద్యార్థులు.. ఈ మేరకు గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ హస్టల్ లో 7 విద్యార్థులు గంజాయితో పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి వసతి గృహంలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించాం. హాస్టల్ గదులు పరిశీలించగా గంజాయి సిగరెట్ పీకలు, 5 గ్రాముల గంజాయి లభించినట్లు సీఐ వెల్లడించారు. ఇది కూడా చదవండి : PM Modi: అర్ధరాత్రి వారణాసి వీధుల్లో తిరిగిన మోడీ.. పోస్ట్ వైరల్! సెక్యూరిటీ గార్డు విక్రయిస్తూ.. ఇదిలావుంటే ఇటీవలే బీచ్ రోడ్ లోని యోగా విలేజ్, మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర గంజాయి విక్రయిస్తూ సెక్యూరిటీ గార్డు పోలీసులకు దొరికారు. యూనివర్సిటీ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను నిలువరించాల్సిన సెక్యూరిటీ సిబ్బందే గంజాయితో పట్టుబడటం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు వాపోతున్నారు. వేలాది మంది విద్యార్థులు చదువుకునే చోట గంజాయి ఆనవాళ్లు బయటపడటం విస్మయానికి గురి చేస్తోందంటున్నారు. #andhra-university #visakhapatnam-andhra-university #7-students #smoking-ganja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి