Kalam View Point: మళ్లీ అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ వచ్చేసిందోచ్‌!

ఏపీ విశాఖలోని సీత కొండ పై వైఎస్సాఆర్‌ వ్యూ పాయింట్‌ మరోసారి హాట్ టాపిక్‌ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీత కొండ పై ఉన్న అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ ని వైఎస్సాఆర్‌ వ్యూ పాయింట్‌ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం గురించి అనేక గొడవలు కూడా జరిగాయి.

New Update
Kalam View Point: మళ్లీ అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ వచ్చేసిందోచ్‌!

Vizag: ఏపీ విశాఖలోని సీత కొండ పై వైఎస్సాఆర్‌ వ్యూ పాయింట్‌ మరోసారి హాట్ టాపిక్‌ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీత కొండ పై ఉన్న అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ ని వైఎస్సాఆర్‌ వ్యూ పాయింట్‌ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం గురించి అనేక గొడవలు కూడా జరిగాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మరోసారి టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సాఆర్ వ్యూ పాయింట్‌ ను అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ గా మార్చారు. గతంలో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా పేరు మార్చడాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో ఈ పని చేసి ఉంటారు.ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గత ఏడాది సీత కొండ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చగా, ఆ సమయంలో వివాదం చెలరేగింది. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

Also read:  విశాఖలో టైకూన్‌ జంక్షన్‌ తొలగింపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు