/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vishaka-jpg.webp)
Man slits women throat in Visakha: విశాఖ(Visakhapatnam) దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. అతికిరాతకంగా ఆమె గొంతను బ్లేడుతో కోసాడు. కక్షతో ప్రియుడు కృరంగా ప్రవర్తించండి. దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది.ఆ వెంటనే అతడు కూడా గొంతు కోసుకున్నాడు. బ్రతుకుంటే ఫోన్ చేయి అని చెప్పి పరార్ అయ్యాడు.మల్కాపురం నెహ్రూ నగర్‌లో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తుంది.
నెహ్రు నగర్ ప్రాంతానికి చెందిన లలిత శ్రీ(Lalitha sree), రామారావు(Ramarao)ఇద్దరూ దాదాపు 10 సంవత్సరాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.ప్రియుడు తరచూ ఆమెను వేధించేవాడు. డబ్బు ఇస్తావా ఇవ్వవా... లేదంటే గొంతు కోసుకుంటా అంటూ పలుమార్లు తనను బెదిరించేవాడని బంధువులు తెలుపుతున్నారు. ఈలాంటి మనస్తత్వం ఉన్న రామారావును పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతావంటూ పెద్దలు నచ్చజేప్పారు. దీంతో రామారావును పెళ్లి చేసుకునేందుకు లలిత నిరాకరించింది. వీరి పెళ్లి విషయంపై పెద్దలు పంచాయితీ పెట్టిన ఫలితం లేకపోయింది.
రామారావుతో లలిత పెళ్లికి అంగీకరించకపోవడంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లలిత శ్రీ మేడపైన వాకింగ్ చేస్తుండగా రామారావు ఆమె వద్దకు వెళ్లాడు.పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాడు.అయితే లలిత పెళ్లికి ససేమిరా అంది. ఇక ప్రియుడు ఓపిక నశించింది.ఎంత బుజ్జగించిన పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అతడు రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న బ్లేడుతో ఆమె కంఠం కోశాడు. ప్రియురాలి పరిస్ధితి చూసిన ప్రియుడు భయందోళన చెందాడు. ఆ వెంటనే అతడు కూడా గొంతు కోసుకున్నాడు. బ్రతుకుంటే ఫోన్ చేయి అని చెప్పి పరార్ అయ్యాడు.వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రామరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఇద్దరమ్మాయిలు సూసైడ్.. ప్రాణం తీసిన మార్ఫింగ్ ఫొటోలు