AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..!

అల్లూరి జిల్లా కొర్రాయి పంచాయతీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..!

Visakha:  విశాఖ జిల్లా కొర్రాయి పంచాయితీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. 40 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో 79 మంది విద్యార్థినిలు ఉండగా వారిలో 40 మంది విద్యార్థినీలు అస్వస్థకు చెందడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: కూతురు వరసయ్యే అమ్మాయితో.. ఆ కౌన్సిలర్ ఏం చేశాడంటే?

శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే భోజనాలకు వెళ్లిన విద్యార్థినిలు కొద్దిసేపటి తర్వాత అస్వస్థకు గురి కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది వారిని హుటాహుటిగా చికిత్స నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో సాయంత్రం భోజనంలో కోడిగుడ్డు, సాంబారు రసం పెట్టగా వాటిన తిన్న విద్యార్థినీలు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.

అస్వస్థతకు గురైన విద్యార్థినిలకు అరకు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఆదిత్య తెలిపారు. వసతి గృహం నిర్వాహకుడి నిర్లక్ష్యమే విద్యార్థినిల అస్వస్థతకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు